MAA Elections: కౌంటింగ్‌లో రచ్చ.. ఎన్నికల అధికారితో ప్రకాష్ రాజ్ గొడవ

కౌగిలింతలు, కొరుకుళ్లు, కొట్లాటల మధ్య మూవీ ఆర్ట్స్ ఆసోసియేషన్ సమరం ముగిసింది.

MAA Elections: కౌంటింగ్‌లో రచ్చ.. ఎన్నికల అధికారితో ప్రకాష్ రాజ్ గొడవ

Prakash Raj

Updated On : October 10, 2021 / 5:35 PM IST

MAA Elections: కౌగిలింతలు, కొరుకుళ్లు, కొట్లాటల మధ్య మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ సమరం ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవ్వగా.. గెలుపు ఎవరిది? అనే విషయంపై ఉత్కంఠ సాగుతోంది. జనరల్ ఎలక్షన్స్‌కు మించి రసవత్తరంగా సాగిన మా ఎన్నికల్లో విజయం సాధించేది ఎవరనేది మరి కొన్నిగంటల్లో తేలిపోతుంది.

‘మా’ ఎన్నిక‌లు మూడు గంట‌ల‌కు ముగిశాయి. పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జ‌రిగింది. వాస్తవంగా రెండు గంటలకే ఎన్నికల ప్రక్రియ ముగియాల్సి ఉన్నా… ఓటింగ్‌కు వ‌చ్చిన స‌భ్యులను చూసి మ‌రో గంట పాటు పొడిగించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 70 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. అయితే, కౌంటింగ్ సమయంలో కూడా రచ్చ జరిగింది. పోస్టల్ బ్యాలెట్‌లు లెక్కించే సమయంలో గందరగోళం చోటు చేసుకుంది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్య గొడవ జరిగింది. ప్రకాష్ రాజ్‌కు ఎన్నికల అధికారికి మధ్య గొడవ జరిగింది.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ముందుగా లెక్కిస్తుండగా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చివర్లో లెక్కించాలని పట్టుబట్టారు ప్రకాష్ రాజ్. అందుకు ఎన్నికల అధికారులు నిరాకరించడంతో గొడవ జరిగింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు కౌంటింగ్ సమయంలో కూడా కనిపిస్తున్నాయి.