కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగే సినిమా షూటింగ్స్‌ను నిలిపివేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మా అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మా అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు డిసైడ్ అయ్యారు.
2020, మార్చి 16వ తేదీ సోమవారం నుంచి ఈనెల 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో జరిగే సినిమా షూటింగ్స్ ఆగిపోనున్నాయి. ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చిన రోజునే తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముందు జాగ్రత్తగా సినీ ఇండస్ట్రీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సినీ పెద్దలు తెలియజేశారు.
See Also | ఏపీలో కరోనా : ఆ జిల్లాల్లో టెన్షన్..కర్నూలులో అనుమానిత వ్యక్తి ఎక్కడ
కరోనా ప్రమాదకరమైన వైరస్ కాబట్టి…రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు థియేటర్స్‌తో పాటు సినిమా షూటింగ్స్‌ను బంద్ చేస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రెటరీ జీవిత రాజశేఖర్ తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
అసోసియేషన్ నిర్ణయానికి మద్దతుగా ప్రతిఒక్కరూ తవవంతు బాధ్యతగా బంద్ పాటించాలని కోరారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ తెలిపారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు…ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మొత్తంగా… ఇండస్ట్రీ నిర్ణయంతో ఫారిన్‌లో ఉన్న వాళ్లంతా ప్యాకప్ చేసుకుని ఇండియాకు తిరిగొస్తున్నారు.
Read More : యువకుడిపై అమృత కంప్లయింట్..ఎందుకు ?