Radhika and Sarathkumar : రాధికా, శరత్ కుమార్ లకు జైలు శిక్ష

ప్రముఖ నటులు, దంపతులు శరత్ కుమార్, రాధికలకు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హీట్ పెంచింది.

Radhika and Sarathkumar : రాధికా, శరత్ కుమార్ లకు జైలు శిక్ష

Court Sentences Radhika And Sarathkumar To One Year

Updated On : April 7, 2021 / 2:07 PM IST

Court sentences : ప్రముఖ నటులు, దంపతులు శరత్ కుమార్, రాధికలకు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హీట్ పెంచింది. 2014లో మ్యాజిక్ ప్రేమ్స్ సంస్థ ఓ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేసింది. ఈ సినిమాకు మ్యాజిక్ అని పేరు పెట్టారు. విక్రమ్ ప్రభు, కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్లుగా నటింప చేయాలని చిత్ర యూనిట్ భావించింది. మ్యాజిక్ ప్రేమ్స్ సంస్థలో శరత్, రాధికలు భాగస్వాములుగా ఉన్నారు.

ఇక ఈ సినిమా నిర్మాణం కోసం రూ. 1.5 కోట్లను రేడియంట్ మీడియా సంస్థ నుంచి అప్పుగా తీసుకున్నారు. 2015 మార్చి నెలలో అప్పును తిరిగి ఇస్తామని అగ్రిమెంట్ చేసుకుంది. అయితే..చెప్పినట్లుగా చేయలేదని సదరు సంస్థ ఆరోపించింది. ఒత్తిడి పెంచడంతో రాధికా, శరత్ కుమార్ లు చెక్కు ఇచ్చారు. వారు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ వారిపై కేసు పెట్టింది. ఈ కేసును చెన్నై స్పెషల్ కోర్టు విచారించింది. 2021, ఏప్రిల్ 07వ తేదీ బుధవారం రాధికా, శరత్ కుమార్ లకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది.