Ram-Boyapati: క్రేజీ కాంబినేషన్.. ఊరమాస్ దర్శకుడితో ఉస్తాద్ హీరో!
దర్శకుడు బోయపాటి అఖండ బ్లాక్ బస్టర్ సినిమాతో మరోసారి ఊరమస్ జాతర కొనసాగించాడు. అంచనాలకి మించి అఖండని..

Ram Boyapati
Ram-Boyapati: దర్శకుడు బోయపాటి అఖండ బ్లాక్ బస్టర్ సినిమాతో మరోసారి ఊరమస్ జాతర కొనసాగించాడు. అంచనాలకి మించి అఖండని ప్యాక్ చేయడంలో బోయపాటి నూటికి వెయ్యిశాతం సక్సెస్ కాగా.. బోయపాటి తర్వాత సినిమా ఏంటన్నది ఆసక్తిగా మారింది. నిజానికి బోయపాటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మరో సినిమా చేయాల్సి ఉంది. గతంలో సరైనోడు కాంబినేషన్ కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.
Tiger Nageswara Rao: టైగర్ కోసం రేణుదేశాయ్.. మాస్ రాజాకి సోదరి?
అయితే.. అల్లు అర్జున్ పుష్ప ఊహించిన దానికంటే భారీ సక్సెస్ కావడంతో ఈ వేడిలో పుష్ప రెండో పార్ట్ కూడా పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. దీంతో మరో ఏడాది పుష్ప రెండో పార్టీ పూర్తయ్యే వరకు బన్నీ మేకోవర్ అలాగే ఉండాలి. దీంతో మరో ఏడాది వరకు బోయపాటి ఇక్కడ స్కోప్ లేదు. అందుకే బోయపాటి ఇప్పుడు యంగ్ హీరో రామ్ పోతినేనితో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట.
Telugu Dubbing Movies: నేషనల్ వైడ్ తెలుగు సినిమా డబ్బింగ్ మేళా
ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రచారం మొదలైంది. అయితే.. ఇప్పుడు అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో వారియర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కాగా ఇది ద్విభాషా సినిమా. బోయపాటి దర్శకత్వంలో రాబోయే సినిమాను కూడా బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కనుందట. అయితే.. ఊరమస్ దర్శకుడి దర్శకత్వం ఉస్తాద్ హీరో ఎలా కనిపించనున్నాడన్నది ఆసక్తిగా మారింది.