Bigg Boss OTT : ఇద్దరు భార్యలతో బిగ్‌బాస్ లోకి యూట్యూబర్.. తీవ్ర విమర్శలు.. బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నారా?

బిగ్ బాస్ లోకి బాలీవుడ్ యూట్యూబర్‌ ఆర్మాన్ మాలిక్‌, అతని ఇద్దరు భార్యలు రావడం గమనార్హం.

Hindi Bigg Boss OTT 3 : తాజాగా హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ -3 ప్రారంభమైంది. ఈసారి అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్నారు. పలువురు సోషల్ మీడియా, యూట్యూబ్ పాపులారిటీ ఉన్నవాళ్ళని ఈ షోకి తీసుకొచ్చారు. అయితే ఈ బిగ్ బాస్ లోకి బాలీవుడ్ యూట్యూబర్‌ ఆర్మాన్ మాలిక్‌, అతని ఇద్దరు భార్యలు రావడం గమనార్హం. ఆర్మాన్ మాలిక్.. పాయల్, కృతిక అనే ఇద్దర్ని పెళ్లి చేసుకొని ఆ ఇద్దరితో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ వైరల్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్మాన్ ఇద్దరితో కలిసి ఉంటాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.

తాజాగా ఆర్మాన్ మాలిక్ హిందీ బిగ్ బాస్ ఓటీటీలోకి తన భార్యలిద్దరితో కలిసి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాడు. దీంతో బిగ్ బాస్ పై, ఈ ముగ్గురిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బిగ్ బాస్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూస్తారు. ఇది ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికా, బహు భార్యత్వాన్ని ప్రోత్సహించడానికా? ఇలాంటి వాళ్ళను ఎందుకు తీసుకొచ్చారు అంటూ బాలీవుడ్ లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలువురు నెటిజన్లు, సెలబ్రెటీలు కూడా విమర్శలు చేస్తున్నారు.

Also Read : Sonakshi Sinha : ఏడేళ్ల ప్రేమ ఒక్కటైంది.. ప్రేమ పెళ్లిపై బాలీవుడ్ భామ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి దేవోలీనా భట్టాచార్జీ ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేస్తూ తన సోషల్ మీడియాలో స్పందించింది. దేవోలీనా భట్టాచార్జీ తన సోషల్ మీడియాలో.. దీన్ని వినోదం అంటారా? ఇలాంటి వాటి గురించి వింటేనే అసహ్యం వేస్తుంది. బిగ్ బాస్ బహు భార్యత్వాన్ని ప్రమోట్ చేస్తున్నారా? వీళ్ళని చూసి అందరూ రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా? బయట రోజూ ఇలాంటి ఘటనలతో చాలా మంది జీవితాలు నాశనం అవుతుంటే మీరు వీటిని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? అందుకే దేశంలో ప్రత్యేక వివాహ చట్టం, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. చట్టం అందరికి ఒకేలా ఉండాలి. ఒకవేళ భార్యలు కూడా ఇద్దరు భర్తల్ని చేసుకుంటే ఒప్పుకుంటారా? ఈ షో చేసే పనిని చూస్తుంటే భయమేస్తుంది. రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలి అనుకుంటే చేసుకొని ఇంట్లో ఉండండి అంతే కానీ ఈ నీచమైన పనిని ప్రపంచానికి చూపించకండి. బిగ్ బాస్ మీకు ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావట్లేదు అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే మొదట్నుంచి ఆర్మాన్ మాలిక్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బిగ్ బాస్ లోకి ఇద్దరు భార్యలతో వచ్చినందుకు విమర్శలు మరింత పెరిగాయి. ఈ ముగ్గురు తమకు ఏడాది వయసు ఉన్న ముగ్గురు పిల్లల్ని బయటే వదిలేసి బిగ్ బాస్ లోకి రావడం గమనార్హం. ఈ విషయంపై కూడా వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు