Daggubati family members are boarding to Sri Lanka for Abhiram wedding
Abhiram Daggubati : దగ్గుబాటి కుటుంబంలో వరుసగా పెళ్లి భజంత్రీలు మోగుతున్నాయి. ఇటీవల విక్టరీ వెంకటేష్ రెండో కూతురి నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు సురేష్ బాబు రెండో కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. డిసెంబర్ 6న ఈ వివాహం జరగబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వివాహం కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో శ్రీలంకలో జరగనుందని చెప్పుకొచ్చారు.
తాజాగా దగ్గుబాటి కుటుంబం అంతా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. వెంకటేష్, సురేష్ బాబు, నాగచైతన్య, రానా, అభిరామ్ మరియు కుటుంబసభ్యులు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. అభిరామ్ పెళ్లి కోసమే వీరు శ్రీలంక పయనమైనట్లు తెలుస్తుంది. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా అభిరామ్ ‘ప్రత్యూష’ అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నారని, ఆమె ఆమెది కారంచేడు అని సమాచారం. డిసెంబరు 6న రాత్రి 8:50 గంటలకు అభిరామ్, ప్రత్యూష మెడలో మూడు మూళ్లు వేయబోతున్నట్లు చెబుతున్నారు.
Also read : Jersey : జెర్సీ సినిమా వెంకటేష్ చేయాల్సిందట.. ఆయన కోసం రాసిన కథని నాని..
కాగా అభిరామ్ ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తేజ దర్శకత్వంలో అహింస సినిమా చేసి ఆడియన్స్ కి పరిచయం అయ్యారు అభిరామ్. ఈ ఏడాది జూన్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో కొంత గ్యాప్ తీసుకోని రెండో సినిమా చేయాలని అభిరామ్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మరి రెండు సినిమాని ఎప్పుడు చేస్తారో చూడాలి. ఇక రానా విషయానికి వస్తే.. రజినీకాంత్ ‘తలైవర్ 170’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. అలాగే తాను ప్రధాన పాత్రలో ‘హిరణ్యకశ్యప’ అనే మైథాలజీ మూవీ చేయనున్నారు.