Daggubati Venkateswara Rao : నందమూరి బాలకృష్ణ హీరోగా 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. ఈ అందర్భంగా నిన్న శనివారం రాత్రి హైదరాబాద్ లో బాలయ్యకు సన్మానం నిర్వహించి ఆ అవార్డుని అందచేశారు. ఈ కార్యక్రమానికి బాలయ్య కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయి బాలయ్య గురించి మాట్లాడారు.(Daggubati Venkateswara Rao)
ఈ ఈవెంట్లో బాలకృష్ణ బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నేను బాలయ్యకు పదేళ్ల వయసు ఉన్నప్పట్నుంచి చూస్తున్నాను. నిక్కర్లు వేసుకొని తిరిగేవాడు. చిన్నప్పుడు అందంగా ఉండేవాడు. వాళ్ళింట్లో ఒక ఆయా ఉండేది. ఓ 45 ఏళ్ళు ఉండేవి ఆమెకు. అందర్నీ బాగా చూసుకునేది. అప్పుడు బాలయ్య ఆమెని సత్యభామ అని, నేను శ్రీకృష్ణుడిని అని ఆమె వెనక తిరుగుతూ డైలాగ్స్ చెప్పేవాడు. అంత చిన్న ఏజ్ లో శ్రీ కృష్ణుని పద్యాలు పాడటం ఆశ్చర్యపోయేవాడ్ని. అప్పుడు అనుకున్నా పెద్దాయన అంశం వచ్చింది, భవిష్యత్తులో గొప్పగా అవుతాడు, మంచి నటుడు అవుతాడు అని. కానీ 50 ఏళ్ళు ఉంటాడని అనుకోలేదు అని అన్నారు.
Also See : Siree Lella : కాబోయే భార్యతో నటించిన నారా రోహిత్.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసి స్పెషల్ పోస్ట్..