Daksha : ఘనంగా ‘దక్ష’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. ఆగస్టు 25న రిలీజ్
సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ (Aayush) హీరో గా నటిస్తున్న చిత్రం దక్ష. ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌లో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

Daksha pre release event
Daksha pre release : సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ (Aayush) హీరో గా నటిస్తున్న చిత్రం ‘దక్ష’. ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌లో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో శ్రీకాంత్ విచ్చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. దక్ష టీం అందరూ దీక్ష తో సినిమాని తీశారని, ఈ చిత్రం ఘన విజయం సాంధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. తల్లాడ సాయికృష్ణతో తనకు 11 సంవత్సరాల నుండి పరిచయం ఉందని, తనకు మంచి ఆప్త మిత్రుడన్నారు. సాయికృష్ణకి, డైరెక్టర్ విక్కీ కి , హీరో ఆయుష్ కి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాన్నట్లు తెలిపారు.
Allu Arjun : ఇది గమనించారా..? అల్లు అర్జున్ సినిమాలతోనే వరుసగా రెండు సంవత్సరాల్లో అవార్డులు..

Daksha pre release event
నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మా దక్ష తప్పకుండా ప్రేక్షకులకుకి నచ్చతుందన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలు కష్టపడి సినిమాను తీసినట్లు తెలిపారు. మంచి ఔట్ పుట్ వచ్చిందని, సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో సినీ నటి స్వప్న చౌదరి, శబరి సినిమా ప్రొడ్యూసర్ మహీంద్రా నాథ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సాయి రాహుల్ తో పాటు దక్ష సినిమా టీం సభ్యులు పాల్గొన్నారు.

Daksha pre release event
Allu arjun : బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్.. సుకుమార్ ఆనందం చూశారా..!