Daksha Nagarkar : ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం అంటున్న ద‌క్ష.. వారితో పరిచయం.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు..

అందాల భామ భామ ద‌క్ష న‌గార్క‌ర్‌ తన బర్త్ డే సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్టుని తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

Daksha Nagarkar : ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం అంటున్న ద‌క్ష.. వారితో పరిచయం.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు..

Daksha Nagarkar emotional post on her birthday gone viral

Updated On : August 13, 2023 / 7:59 PM IST

Daksha Nagarkar : ముంబై భామ ద‌క్ష న‌గార్క‌ర్‌ తెలుగు సినిమాలతో వెండితెరకు పరిచయం అయ్యింది. ‘ఏకే రావు పీకే రావు’ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైన ఈ భామ.. హోరా హోరి, హుషారు, జాంబిరెడ్డి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు స్టార్ హీరో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అండ్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకి మంచి ఫాలోయింగే ఉంది. హాట్ హాట్ అందాలతో ద‌క్ష పోస్టు చేసే ఫోటోలకు నెటిజెన్స్ ఫిదా అవుతూ లైక్స్ కొడుతూ ట్రెండ్ చేస్తుంటారు.

Vishwak Sen : పెళ్లి పీటలు ఎక్కబోతున్న విశ్వక్ సేన్.. ఆగష్టు 15న.. పోస్టు వైరల్..!

ఇది ఇలా ఉంటే, ఈ భామ తాజాగా 25వ పుట్టినరోజుని జరుపుకుంది. ఈ బర్త్ డేని దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) బిల్డింగ్ లో జరుపుకుంది. ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పిక్స్ ని తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టు వేసింది. “2023 వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా నాకు ఎంతో గొప్ప సంవత్సరం. అద్భుతమైన ప్రాజెక్ట్స్ లో అవకాశం రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం.. ఇలా ప్రతిరోజు మెరుగుపడుతూ వెళ్తుంది. నేను పుట్టినరోజు ఘనంగా జరుపుకునే వ్యక్తిని కాదు, కానీ మీ ఆశీర్వాదాలు, దేవుడి కృప నేను ఇవాళ ఇక్కడ ఇలా చేసుకునేలా చేస్తున్నాయి. మీ ప్రేమ, ప్రశంసలు, శుభాకాంక్షలకు అన్నిటికి ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది.

Rajinikanth : ‘స్వామీజీ చెప్పారు.. జైల‌ర్ హిట్ అయిన‌ట్టే లెక్క‌..’ ర‌జినీకాంత్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

 

View this post on Instagram

 

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)

ఇక ఈ పోస్టులో ద‌క్ష షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వైట్ టాప్ అండ్ జీన్స్ ట్రాక్ లో అమ్మడి అందాలు చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, సూపర్ ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా బంగారాజు సినిమాలో నాగచైతన్యతో కలిసి ఒక సాంగ్ లో చిందేసి బాగా అక్కట్టుకుంది. ఆ పాటలో తన అందాలతో, డాన్స్ తో మంచి మార్కులే కొట్టేసింది.