Daku Maharaaj Event In USA Aha Offering Chance To Win Tickets
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలతో భారీ హిట్స్ అందుకున్నాడు బాలయ్య. తాజాగా ఆయన బాబీ దర్శ కత్వంతో డాకు మహారాజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియల్ విలన్‌గా కనిపించనున్నాడు.
యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి ఓ కీలక పాత్రను పోషిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడులైన పోస్టర్స్, గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.
Pushpa 2 : ఓటీటీలోకి ‘పుష్ప 2’.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఎప్పుడో తెలుసా?
ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలో గ్రాండ్‌గా ఫ్లాన్ చేశారు. జనవరి 4న టెక్సాస్‌లో ఈవెంట్ జరగనుంది. కాగా.. ఈ ఈవెంట్‌కు వెళ్లే వారి కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా బంఫర్ ఆఫర్ ఇచ్చింది.
Zebra OTT Streaming : ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ జీబ్రా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
డిసెంబర్ 31 లోగా ఆహా గోల్డ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే డాకు మహారాజ్ ఈవెంట్‌ను లాంజ్‌లో కూర్చోని చూడొచ్చు. అంతేనా.. బాలయ్యని నేరుగా కలిసే అవకాశాన్ని సైతం పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆహా గోల్డ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.. బాలయ్యను కలుసుఓండి.