Pushpa 2 : ఓటీటీలోకి ‘పుష్ప 2’.. క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్‌.. ఎప్పుడో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది

Pushpa 2 : ఓటీటీలోకి ‘పుష్ప 2’.. క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్‌.. ఎప్పుడో తెలుసా?

Pushpa 2 OTT release Makers confirm the film will not stream before 56 days of release

Updated On : December 21, 2024 / 9:17 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది. రెండు వారాల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1500 కోట్ల‌పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇక నార్త్‌లోని రికార్డుల‌ను అన్నింటిని తుడిచిపెట్టేస్తుంది. 15 రోజుల్లోనే రూ. 632.50 నెట్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ క్ర‌మంలో హిందీ సినిమాల‌ చరిత్ర‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది.

విడుద‌లై రెండు వారాలు పూరైన కూడా హౌస్ పుల్ బోర్డుల‌తో స‌క్సెస్ ఫుల్ ర‌న్ అవుతోంది. అయితే.. గ‌త రెండు మూడు రోజులుగా ఈ చిత్ర ఓటీటీకి సంబంధించిన వార్తలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. జ‌న‌వ‌రి 9న పుష్ప‌2 మూవీ ఓటీటీలోకి రానుంద‌నేది స‌ద‌రు వార్త‌ల సారాంశం. వీటిపై చిత్ర బృందం స్పందించింది. అవ‌న్నీ రూమ‌ర్లే అని కొట్టిపారేసింది. ఇప్ప‌ట్లో ఈ చిత్రం ఓటీటీలోకి రాద‌ని, థియేట‌ర్ల‌లో ఈ మూవీని చూసి ఆస్వాదించాల‌ని తెలిపింది.

సంక్రాంతి సినిమాల పండుగ అక్కడేనా..? పోటాపోటీ ప్రమోషన్లు..!

“పుష్ప‌2 మూవీ ఓటీటీకి సంబంధించిన పుకార్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌ట్లో ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం లేదు. విడుద‌లైన 56 రోజుల త‌రువాతే ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. అప్ప‌టి వ‌ర‌కు పుష్ప‌2 వైల్డ్ ఫైర్‌ను థియేట‌ర్ల‌లో చూసి ఎంజాయ్ చేయండి.” అని సోష‌ల్ మీడియాలో చిత్ర బృందం తెలిపింది.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో ర‌ష్మిక క‌థానాయిక‌. ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల‌ను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించింది.

Zebra OTT Streaming : ఓటీటీలోకి వ‌చ్చేసిన స‌త్య‌దేవ్ జీబ్రా.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?