సంక్రాంతి సినిమాల పండుగ అక్కడేనా..? పోటాపోటీ ప్రమోషన్లు..!

సంక్రాంతి అంటేనే సినిమాల సందడి.

సంక్రాంతి సినిమాల పండుగ అక్కడేనా..? పోటాపోటీ ప్రమోషన్లు..!

Three Star heros films release on Sankranti season

Updated On : December 21, 2024 / 9:02 AM IST

సంక్రాంతి అంటేనే సినిమాల సందడి. అలాంటిది ఈ సంక్రాంతి వేళ ముగ్గురు బిగ్ స్టార్ల సినిమాలు జాతర చేసేందుకు రెడీ అవుతున్నాయి. అంతకు ముందే ఫెస్టివల్ డోస్ పెంచడానికి ఈ మూడు సినిమాలు భారీ స్కెచ్ వేశాయి. ఇంతకీ ఆ బిగ్‌ స్టార్ట్స్ పండుగ పూట ఏం చేయబోతున్నారు. ఫ్యాన్స్‌కి ఎలాంటి కిక్కు ఇవ్వబోతున్నారో చూద్దాం..

ప్రతి ఏటా సంక్రాంతి వచ్చిదంటే.. బరిలో పందెం కోళ్లే కాదు.. థియేటర్లలో సినిమాలు కూడా పోటీకి సై అంటాయి. సంక్రాంతి సీజన్ రాగానే టాలీవుడ్‌కి కావాల్సినంత బూస్ట్‌ వస్తుంది. ఎన్ని సినిమాలు వచ్చినా.. లాభాలు లెక్కపెట్టుకోవడమే అన్నట్టుగా కలెక్షన్స్ వస్తుంటాయి. సంక్రాంతికి మించిన ముహూర్తం టాలీవుడ్‌కి లేనేలేదు.

ముగ్గురు బడా హీరోల సినిమాలు.. ఈసారి సంక్రాంతి సంబురాలను రెట్టింపు చేసేందుకు రెడీగా ఉన్నాయి. రామ్‌చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్ చిత్రాలతో పాటు, విక్టరీ వెంకటేశ్‌, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా ఈ సంక్రాంతికే రిలీజ్ కాబోతుంది. గేమ్‌చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండూ సినిమాలు కూడా దిల్‌రాజ్‌ నిర్మాణంలోనే వస్తున్నాయి. దీంతో దిల్‌రాజ్‌ ఈ సంక్రాంతికి డబుల్ సందడి చేసేందుకు రెడీగా ఉన్నారన్నమాట.

Janaki vs State of Kerala : అనుపమ పరమేశ్వరన్ ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

ఇదంతా పక్కన పెడితే ఈసారి సంక్రాంతి డోస్‌ను పెంచడానికి ఈ మూడు సినిమాల ప్రొడ్యూసర్లు ప్లాన్ చేశారట. నిజానికి సంక్రాంతి రాగానే పట్టణం.. పల్లెకు పోతుంది. సిటీ జనమంతా సొంతూరిలో వాలిపోతారు. ముఖ్యంగా సంక్రాంతికి ఏపీలో ప్రతి పల్లె సంబురాల స్వర్గంగా మారిపోతుంది. అందుకే సినిమా మేకర్స్ కూడా ఈ మూడు సినిమాల ఈవెంట్లను ఏపీకి షిప్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఏపీలో జనవరి ఫస్ట్‌వీక్‌ నుంచే సంక్రాంతి సెలవులు రానున్నాయి. ఈ టైమ్‌ను యూజ్ చేసుకోవాలని నిర్మాతలు అక్కడే ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

సంక్రాంతి పండగ వేళ బంధువులతో, కొత్త అల్లుళ్లతో ప్రతి ఇల్లు సందడిగా కనిపిస్తుంది. ఇటు సినిమా ఈవెంట్లకు కూడా అతిథిలను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. గేమ్‌ ఛేంజర్‌ మూవీని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్‌ ఈవెంట్‌కు సీఎం చంద్రబాబుని ఆహ్వానించాలని సినిమా యూనిట్‌ప్లాన్ చేస్తుందట. ఇక వెంకటేశ్‌ కూడా ప్రిన్స్ మహేశ్‌ని ఈవెంట్‌కు గెస్ట్‌గా తీసుకుతీసుకురావాలని చూస్తున్నారట. ఇదే నిజమైతే.. ఇక అసలు సంక్రాంతి జాతర.. జనవరి ఫస్ట్ వీక్‌ నుంచే మోతమోగిపోతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారట. మరి ఆ ఈవెంట్లను ఎక్కడెక్కడ ప్లాన్ చేశారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే..

Pawan Kalyan : హరిహర వీరమల్లు, OG సినిమాల్లో ఐటెం సాంగ్స్.. పవన్ తో చిందులేసే ఆ భామలు..