Pawan Kalyan : హరిహర వీరమల్లు, OG సినిమాల్లో ఐటెం సాంగ్స్.. పవన్ తో చిందులేసే ఆ భామలు..

హరిహర వీరమల్లు, OG సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉన్నాయి.

Pawan Kalyan : హరిహర వీరమల్లు, OG సినిమాల్లో ఐటెం సాంగ్స్.. పవన్ తో చిందులేసే ఆ భామలు..

Anasuya and Neha Shetty Steps for Pawan Kalyan HariHara VeeraMallu and OG Movies Special Songs

Updated On : December 19, 2024 / 9:03 AM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తన రాజకీయాలతో బిజీగా ఉన్నా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి హరిహర వీరమల్లు, OG సినిమాలకు డేట్స్ ఇస్తున్నారు. హరహర వీరమల్లు షూటింగ్ పూర్తి కావొచ్చింది. మరో పక్కన OG సినిమా పవన్ లేని సీన్స్ బ్యాంకాక్ లో షూట్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉన్నాయి.

గతంలోనే హరిహర వీరమల్లు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అని నటి, యాంకర్ అనసూయ అధికారికంగా చెప్పేసింది. దీంతో హరిహర వీరమల్లు సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తుందని అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఆ పాట షూటింగ్ కూడా పూర్తయింది.

Also Read : Keerthy Suresh – Vijay : కీర్తి సురేష్ పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా విజయ్.. ఫొటోలు వైరల్..

ఇప్పుడు OG సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం OG సినిమా బ్యాంకాక్ లో షూట్ జరుపుకుంటుంది. పలు యాక్షన్ సీన్స్ ని షూట్ చేస్తున్నట్టు సమాచారం. డైరెక్టర్ సుజీత్, కెమెరామెన్ రవి చంద్రన్ బ్యాంకాక్ నుంచి ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేహా శెట్టి కూడా ఇదే షూట్ లో ఉన్నట్టు ఓ ఫోటో షేర్ చేసింది. టాలీవుడ్ లో కూడా నేహశెట్టి OG సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుందని వినిపిస్తుంది. దీంతో ఓ ఐటెం సాంగ్ మధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తున్నారని, ఆ ఐటెం సాంగ్ లో నేహశెట్టి స్టెప్పులేస్తోందని తెలుస్తుంది.

DJ టిల్లు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది నేహా శెట్టి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది ఈ కన్నడ భామ. ఇప్పుడు ఏకంగా పవన్ OG సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్ కొట్టేసింది. ఇలా పవన్ సినిమాల్లో అనసూయ, నేహశెట్టి స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ పట్టేసారు. మరి ఆ సాంగ్స్ లో పవన్ వీరితో కలిపి స్టెప్పులేస్తాడా లేదా కేవలం వారి పైనే ఈ సాంగ్స్ ఉంటాయా తెలియాలంటే ఆ సినిమాలు వచ్చేదాకా ఆగాల్సిందే.