Keerthy Suresh – Vijay : కీర్తి సురేష్ పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా విజయ్.. ఫొటోలు వైరల్..
ఇటీవల కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Vijay Blessed New Couple Keerthy Suresh Antony at Their Wedding Photos goes Viral
Keerthy Suresh – Vijay : ఇటీవల కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి డిసెంబర్ 12న గోవాలో హిందూ సాంప్రదాయ పద్దతిలో జరిగింది. ఆ తర్వాత క్రిస్టియన్ పద్దతిలో కూడా చేసుకున్నారు. అయితే వీరి పెళ్ళికి కేవలం ఇటు కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులు మాత్రమే వచ్చారు.
Also Read : Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
తన పెళ్ళికి ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారంటూ తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ వచ్చి కొత్త జంటను ఆశీర్వదించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది కీర్తి సురేష్. విజయ్ కొత్త జంటతో దిగిన ఫోటోలను షేర్ చేసి.. మా డ్రీం ఐకాన్ విజయ్ సర్ మా డ్రీం వెడ్డింగ్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు అంటూ పోస్ట్ చేసింది కీర్తి సురేష్. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. గతంలో కీర్తి సురేష్, విజయ్ జంటగా సర్కార్ సినిమాలో నటించారు.