Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

తాజగా స్నేహ రెడ్డి ఆస్తుల విలువ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Do You Know Allu Arjun Wife Allu Sneha Reddy assets Here Details

Updated On : December 18, 2024 / 9:22 PM IST

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్యగా స్నేహ రెడ్డి అందరికి పరిచయమే. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలతో పాటు పిల్లలు అర్హ, అయాన్ ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా మరింత వైరల్ అవుతుంది అల్లు స్నేహ రెడ్డి. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ స్టార్ భార్యకి ఏకంగా 9.3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజగా స్నేహ రెడ్డి ఆస్తుల విలువ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్నేహ రెడ్డి తండ్రి కుటుంబం కూడా డబ్బున్న కుటుంబమే. స్నేహరెడ్డి తండ్రి రాజకీయ నేత, పలు బిజినెస్ లు ఉన్నాయి, ఓ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంది. స్నేహ రెడ్డి తన తండ్రికి చెందిన ఓ కంపెనీలో డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తుందట. ఇక ఇప్పటికే స్నేహ రెడ్డి పలు బ్రాండ్స్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ సంపాదిస్తుంది. అలాగే ఇటీవలే పికాబూ అనే ఆన్ లైన్ ఫొటోస్టూడియో సంస్థని కూడా ప్రారంభించి సక్సెస్ ఫుల్ గా నడిపిస్తుంది.

Also Read : The Raja Saab : ప్రభాస్ ‘రాజాసాబ్’ అప్డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ.. అవన్నీ నమ్మకండి.. టీజర్ ఇప్పట్లో లేనట్టే..

ఇక ఎలాగో స్నేహ రెడ్డి పేరు మీద ఆస్తులు కూడా ఉంటాయి. కేవలం అల్లు స్నేహ రెడ్డి నికర ఆస్తుల విలువ దాదాపు 42 కోట్ల రూపాయలు అని సమాచారం. దీంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ పక్క ఫ్యామిలీని చూసుకుంటూనే, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే, మరో పక్క తన బిజినెస్ కూడా నడిపిస్తూ సక్సెస్ ఫుల్ మహిళగా దూసుకుపోతుంది స్నేహరెడ్డి. దీంతో బన్నీ అభిమానులు, పలువురు నెటిజన్లు స్నేహ రెడ్డిని అభినందిస్తున్నారు.