Zebra OTT Streaming : ఓటీటీలోకి వ‌చ్చేసిన స‌త్య‌దేవ్ జీబ్రా.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

టాలీవుడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ లు ప్ర‌ధాన పాత్రల్లో న‌టించిన చిత్రం జీబ్రా.

Zebra OTT Streaming : ఓటీటీలోకి వ‌చ్చేసిన స‌త్య‌దేవ్ జీబ్రా.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

Satya dev Zebra movie streaming in Aha ott

Updated On : December 20, 2024 / 11:49 AM IST

టాలీవుడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ లు ప్ర‌ధాన పాత్రల్లో న‌టించిన చిత్రం జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ప్రియా భవానీ శంకర్ క‌థానాయిక‌. నవంబర్ 22న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సస్పెన్స్ జానర్‌లో బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని చాలా మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వ‌చ్చింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదిక‌గా శుక్ర‌వారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Mufasa : ‘ముఫాసా’ మూవీ రివ్యూ.. మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమా ఎలా ఉందంటే..?

వాస్త‌వానికి ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న‌వారికి మాత్రం 48 గంట‌లు ముందుగానే ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నారు.

సత్యరాజ్, సత్య, జెన్నిఫర్ పిషినాటో కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం లు నిర్మించారు.

Bachhala Malli : ‘బచ్చల మల్లి’ మూవీ రివ్యూ.. క్లైమాక్స్ లో అల్లరి నరేష్ ఏడిపించేశాడుగా..