Dance IKON 2 : ఆహాలో డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆహాలో డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ స్ట్రీమింగ్ తేదీ ఫిక్సైంది.

Dance IKON 2 wildfire streaming date fix

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ప్రేక్ష‌కులు బుల్లి తెర‌పై ఎన్నో డాన్స్ షోలు చూశారు. అయితే.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అయిన డాన్స్ ఐకాన్ షో ఎంతో స్పెష‌ల్‌గా నిలిచింది. తొలి సీజ‌న్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. రెండో సీజ‌న్ ఎప్పుడెప్పుడా అని ఎంతో మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆహా సంస్థ శుభ‌వార్త చెప్పింది. ఇప్ప‌టికే రెండో సీజ‌న్‌కు సంబంధించిన కంటెస్టంట్ల ఆడిష‌న్స్ పూర్తి అయిన సంగ‌తి తెలిసిందే.

డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్‌ ఫిబ్ర‌వ‌రి 14 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలియ‌జేసింది. యాంక‌ర్‌గా ఓంకార్, జ‌డ్జిలుగా ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్‌, హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లాలు వ్య‌హ‌రించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు ఓ వీడియోను విడుద‌ల చేసింది.

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ కి నెగిటివ్ ప్రచారం చేసింది ఎవరు?

Daaku Maharaaj Collections : బాక్సాఫీస్ వ‌ద్ద ‘డాకు మ‌హారాజ్’ దూకుడు.. ఐదు రోజుల్లో ఎంతంటే..?

ఇది సాధార‌ణ డ్యాన్స్ షో కాదు.. వీళ్లు సాధార‌ణ జ‌డ్జిలు కాదంది. ఈ సారి ఎన్నో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌లు, ట్విస్టులు, మ‌లుపులు, అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ లు ఉండ‌నున్న‌ట్లు చెప్పింది.