Daaku Maharaaj Collections : బాక్సాఫీస్ వ‌ద్ద ‘డాకు మ‌హారాజ్’ దూకుడు.. ఐదు రోజుల్లో ఎంతంటే..?

బాక్సాఫీస్ వ‌ద్ద డాకు మ‌హారాజ్ దూకుడు కొన‌సాగుతోంది.

Daaku Maharaaj Collections : బాక్సాఫీస్ వ‌ద్ద ‘డాకు మ‌హారాజ్’ దూకుడు.. ఐదు రోజుల్లో ఎంతంటే..?

Balakrishna Daaku Maharaaj Five Days Collections Here

Updated On : January 17, 2025 / 2:45 PM IST

బాక్సాఫీస్ వ‌ద్ద డాకు మ‌హారాజ్ దూకుడు కొన‌సాగుతోంది. బాల‌కృష్ణ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాల‌య్య స‌రికొత్త‌గా క‌నిపించ‌డంతో పాటు యాక్ష‌న్ సీన్స్ అద్భుతంగా ఉండ‌డం ఈ చిత్రానికి చాలా బాగా ఫ్ల‌స్ అయింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్ప‌టికే వంద కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.114 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఈ విష‌యాన్ని చిత్ర బృందం తెలిపింది. సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట‌ర్‌ను పోస్ట్ చేసి ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది. కాగా.. తొలి రోజే ఈ చిత్రం రూ.56 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి బాలకృష్ణ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ ఓపెనింగ్ సాధించిన మూవీగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇంకా సంక్రాంతి సెల‌వులు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కావం ఉంది.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది.. వైద్యులు ఏం చెప్పారంటే

సినీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం హిట్ అని అనిపించుకోవాలంటే రూ.160కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించాలి. ఐదు రోజుల్లోనే రూ.114 కోట్లు రాబ‌ట్ట‌డంతో మ‌రో మూడు లేదా నాలుగు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Sankranthiki Vasthunam collections : వంద కోట్ల క్ల‌బ్‌లో ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’.. వెంకీమామ హ‌వా మామూలుగా లేదుగా..

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ మూవీని నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ లు క‌థానాయిక‌లుగా న‌టించారు. బాబీ డియోల్‌, ఊర్వ‌శీ రౌతేలా, స‌చిన్ ఖేద్క‌ర్‌, చాందిని చౌద‌రిలు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.