టాలీవుడ్ లో డేంజర్ బెల్స్ : కొంప ముంచుతున్న భారీ బడ్జెట్ సినిమాలు

టాలీవుడ్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి... భారీ బడ్టెట్ సినిమాలు నిండా ముంచుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : February 9, 2019 / 04:01 PM IST
టాలీవుడ్ లో డేంజర్ బెల్స్ : కొంప ముంచుతున్న భారీ బడ్జెట్ సినిమాలు

టాలీవుడ్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి… భారీ బడ్టెట్ సినిమాలు నిండా ముంచుతున్నాయి.

హైదరాబాద్ : టాలీవుడ్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.. భారీ బడ్టెట్ సినిమాలు నిండా ముంచుతున్నాయి.. స్థాయికి మించి బడ్టెట్ తో.. అంచనాలను మించి హైపులతో.. టార్గెట్ లను రీచ్ అవ్వలేక నిర్మాతలను.. బయ్యర్లను.. డిస్టిబ్యూటర్స్ రోడ్డున పడే పరిస్థితి వస్తుంది.. ఈ పరిస్థితికి కారణం ఏమిటి..ఎవరు.. ఇప్పుడు ఇండస్ట్రీ అంతటా ఎఫ్2 మూవీ హాట్ టాపిక్.. సాధరాణ బడ్టెట్ మూవీగా రూపొంది దాదాపు 100 కోట్ల వరకు కలక్ట్ చేసింది.. గీతాగోవిందం కూడా అంతే యావరేజ్ బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్ల  వసూళ్లు సాధించింది.. ఎఫ్2, గీతగోవిందం నానానికి  ఒక వైపు మాత్రమే.. నానానికి రెండో వైపు భారీ ఆకారం ఉంది.. వియన విధేయ రామ.. ఇప్పుడు ఈ సినిమా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.. భారీ బడ్టెట్ తో వచ్చి..కొంపముంచింది.. అజ్ఞాత వాసి, స్పైడర్ మిగిల్చిన నష్టాలు మరువక ముందే.. మరో దెబ్బతగిలింది…

ఇప్పడున్న ఈపరిస్థితి సినిమా వాళ్లు కోరి తెచ్చుకున్నదే.. సినిమా అంత కలక్ట్ చేస్తుందా లేదా అని అంచనా వేయకుండా.. మినిమమ్ ఇంత పెడితే చాలు అనుకోకుండా అత్యశలకు పోయి.. ఆ సినిమా స్థాయిని మించి డబ్బులుపోసి కొంటున్నారు… కాని ఆ సినిమాలు అంత రాబట్టలేకపోవడంతో నష్టాల్లో మునికి నెత్తిన తడిగుడ్డేసుకోవలసి వస్తుంది..అంతే కాదు సినిమాలకోసం ఖర్చువిపరీతంగా పెంచేస్తున్నారు దాంతో బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగా పెరిగిపోతోంది.. దానికి తోడు భారీ అంచనాలు.. లేనిపోని హైప్ క్రియేట్ చేయడంతో..  పెరిగిన అంచనాలను అందుకోలేక సినిమాలు నష్టాలను చూస్తున్నాడయి.  2.0..  వినయ విధేయ రామ.. కథానాయకుడు, స్పైడర్ లాంటి సినిమాలు ఈ విధంగానే డిజాస్టర్స్ లిస్ట్ లో చేరాయి… 

ఎంత స్టార్ సినిమా అయినా 40నుండి 50 కోట్ల బడ్జెట్ లిమిట్ తో సినిమా తీస్తే.. నిర్మాత సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది…బాహుబలి లాంటి సినిమాలను చూసి, అది హిట్ అయ్యింది కదా అని వాటిని అనుసరించి చేతులు కాల్చుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే. ఎంత పెద్ద సినిమా అయిన.. హిట్ అయ్యింది అనుకున్నా.. 10 శాతం లాభాలతోనే బయట పడుతున్నారు.. భారీగా బడ్టెట్ పెట్టి.. సినిమా ఆడకపోతే మాత్రం 50 పర్సన్ట్ వరకు నష్టాలను చూస్తున్నారు.. ఆ విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన నిర్మాతలు స్టార్ హీరోలు దొరికారా.. స్టార్ కాస్ట్ ఉన్నారా లేదా.. బడ్టెట్ పెట్టామామా లేదా అని కాంబినేషన్స్ సెట్ చేయడం వరికే పరిమితం అవుతున్నారు.
ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు ఐదు ఆరు కోట్లు మాత్రమే పలికేవి.. ఎంత పెద్ద స్టార్ మూవీ అయినా ఇరవై ముప్పై కోట్లు మించకపోయేవి కాని డబ్బింగ్ సినిమాలు వాళ్ల స్థాయికి మించి అమ్మడం.. ఇక్కడ వారుకూడా సోయి లేకుండా వేలం వెర్రిగా కొనడంతో నష్టాల ఊబిలో చిక్కుకపోతున్నారు..  సూపర్ స్టార్ రజనీ రోబో2.0 ను కొన్నవారికి చుక్కలు చూపించింది.. తలైవా రీసెంట్ మూవీ పెటా 10 కోట్లు పెట్టి కొంటే అతి కష్టం మీద 5 కోట్ల వరకు రాబట్టింది.. డబ్బింగ్ సినిమాలను కూడా కన్నూ మిన్ను తెలియకుండా అంతంత పెట్టి కొనడంతో భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది..

రానున్న కాలంలో భారీ బడ్టెట్ సినిమాలు నాలుగైదు రిలీజ్ కాబోతున్నాయి.. ఇప్పుడు అందరి చూపు వాటిమీదే ఉంది. భారీ సెట్టింగ్ లతో చిరంజీవి 300 కోట్ల బడ్టెట్ తో  సైరా నరసింహా రెడ్డీ సినిమాను తెరకెక్కిస్తుంటే.. ప్రభాస్ హీరోగా దాదాపు 300 కోట్ల తో సాహో నునిర్మిస్తున్నారు. ఇక మహేబాబు మహర్షి మూవీ 100 కోట్లకు దగ్గర వెళ్లింది. రాజమౌళీ బాహుబలి తరువాత చరణ్ ఎన్టీఆర్ తో త్రిబుల్ ఆర్ ను 300 కోట్లు పెట్టి తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాల వరకు భారీ బడ్టెట్ పెడుతున్నారు కాని అందరూ వేలం వెర్రిగా బడ్జెట్ పెంచుకుంటూ పోతే బయ్యర్ అనేవాడు మిగలడు.. నిర్మాత వెన్నువిరగడం కూడా ఖాయం…