రజనీకాంత్ దర్బార్ లో ప్రముఖ నటుడు

సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ మూవీ సెట్స్‌లోకి బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామస్ అడుగు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ దర్భార్ టీంతో జాయిన్ అయినట్టు సమాచారం. గోలి సోడా 2 చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చెంబన్ ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించాడు. ఈ సినిమాతో ఆయనకి తమిళంలోను మంచి ఆఫర్స్ రావడం ఖాయమని చెబుతున్నారు.
ఇటీవలే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమాలో రజనీకాంత్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. ముంబైలో చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. రీసెంట్‌గా ఈ చిత్ర షూటింగ్‌లో నయనతార కూడా జాయిన్ అయింది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలకానుంది.