Gummadi Daughter Sarada : సీనియర్ నటుడు గుమ్మడి కూతురు ఎమోషనల్.. నాన్నని చాలామంది మోసం..!
ఇప్పుడంటే సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరిగినా క్షణాల్లో బయటకు వచ్చేస్తోంది. ఒకప్పుడు సినిమా వాళ్లు ఎదుర్కున్న ఇబ్బందులు ఇప్పుడు వారి పిల్లలు వచ్చి మాట్లాడుతుంటే తెలుస్తోంది. తాజాగా సీనియర్ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి కుమార్తె శారద ఆయన ఎదుర్కున్న ఇబ్బందులు గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Actor Gummadi Daughter Sarada
Actor Gummadi Daughter Sarada : సీనియర్ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని ఆయన నటనని ఎవరూ మర్చిపోరు. ఆయన మన మధ్య లేకపోయినా వందలాది సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి అలరించారు. ఇటీవల ఆయన ఎదుర్కున్న కొన్ని ఇబ్బందుల్ని గుర్తు చేసుకున్నారు ఆయన కుమార్తె శారద. మహానటి సావిత్రితో తన తండ్రికి ఉన్న అనుబంధాన్ని షేర్ చేసారు.
Kannada actor Darshan : వెలుగుచూసిన కన్నడ నటుడి పులిగోరు ఫొటోలు…అటవీశాఖ అధికారుల సోదాలు
సినిమా వాళ్ల పిల్లలు అంటే చదువురాదని, అహంకారం ఉంటుంది అనే ఫీలింగ్ ఈ సొసైటీలో ఇప్పటికీ ఉందన్నారు సీనియర్ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు కుమార్తె శారద. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తమ తండ్రి తమని చాలా స్ట్రిక్ట్‌గా పెంచారని చెప్పారు. తన తండ్రి ఏ నటుడితోను పోటీ పడకుండా వచ్చిన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లారని చెప్పుకొచ్చారు. ఎంతోమంది నటులు, రచయితలు, టెక్నీషియన్స్‌కి ఛాన్సులు ఇప్పించారని .. వారిప్పుడు ఉన్నత స్ధాయిలో ఉండి బయట ఇంటర్వ్యూలు ఇస్తూ ఒక్కరూ తమ తండ్రి పేరు తలవకపోవడం బాధనిపిస్తుందని శారద ఆవేదన వ్యక్తం చేసారు. చాలామంది ప్రొడ్యూసర్లు డబ్బులు ఎగ్గొట్టారని అన్నారామె.
Tharun Bhascker : కీడా కోలా సినిమాలో అల్లు అరవింద్‌ని నటించమని అడిగితే..
క్రమశిక్షణ, అంకిత భావంతో తన తండ్రి గుమ్మడి సినిమా ఇండస్ట్రీలో పని చేసారని శారద చెప్పారు. పెరాల్సస్ వచ్చిన సందర్భంలో స్వర పేటిక దెబ్బ తిని కొంతకాలం సినిమాలకు దూరం అయ్యారని.. ఆ తర్వాత గుండె బలహీన పడటం.. ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వడం కారణంగా సినిమాలకు దూరమయ్యారని అన్నారామె. సీనియర్ నటి సావిత్రితో తన తండ్రికి ప్రత్యేక అనుబంధం ఉందని ఆమెను సొంత చెల్లిగా భావించేవారని చెప్పారు. ఎవరిని సాయం అడిగే మనస్తత్వం కాకపోవడం వల్లే ఎవరి చేయూత అందక సావిత్రి గారు చివరి దశలో కష్టాలు ఎదుర్కున్నారని శారద అన్నారు. ఇప్పటికీ తమ తండ్రి గుమ్మడిని అందరూ గుర్తు పెట్టుకోవడం.. గుర్తించడం తమకెంతో గర్వకారణం అన్నారు శారద.