IND vs SA : ఓరి దేవుడా.. ఐదో టీ20 కూడా ఫసక్? అహ్మదాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఇదే..
IND vs SA : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన నాల్గో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఐదో టీ20 మ్యాచ్ కూడా..
IND vs SA
IND vs SA : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు చివరి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా సిరీస్‌ను సమం చేయాలని సఫారీ ప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే, ఈ మ్యాచ్‌పై కూడా పొగమంచు ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. మ్యాచ్ సైతం రద్దయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : IND vs SA : దక్షిణాప్రికాతో చివరి టీ20 మ్యాచ్.. టీమిండియాకు బిగ్‌షాక్.. కెప్టెన్ మార్పు చూపిస్తాడా..?
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన నాల్గో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ ప్రేమికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ పూర్తిగా రద్దయింది. అయితే, ఇవాళ జరిగే చివరి మ్యాచ్‌కు కూడా పొగమంచు ముప్పు పొంచిఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ పై పొగమంచు ప్రభావం ఉంటుందా..? అని క్రికెట్ అభిమానులు కలవరపడుతున్నారు. అయితే, ఐదో టీ20 మ్యాచ్‌కు వాతావరణపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని తెలుస్తోంది.
అహ్మదాబాద్‌లో పొంగ మంచు ప్రభావం ఉన్నప్పటికీ లక్నోలోలా మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. అహ్మదాబాద్‌లో పొగమంచు ఉంటుందని, అలా అని మ్యాచ్‌ను రద్దుచేసే స్థాయిలో పొగమంచు ప్రభావం ఉండదు.
భారత వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. సాయంత్రం అంతా ఆకాశం స్పష్టంగా ఉంటుందని, మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రతలు 15డిగ్రీల సెల్సియస్ నుంచి 30డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలిగించదని చెప్పారు.
వర్షం పడే అవకాశం లేదు. ముఖ్యంగా పొగమంచు ప్రభావం ఉన్నప్పటికీ.. అది తీవ్రస్థాయిలో ఉండదు. తేలికపాటి గాలులు వీచే అవకాశం ఉంది. అయితే, ఈ మైదానంలో రెండో స్థానంలో బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.
