Allu Arjun : అల్లు అర్జున్‌కి డేవిడ్ వార్నర్ బర్త్ డే విషెస్..

ఆస్ట్రేలియాన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అల్లు అర్జున్ ని అభిమానిస్తుంటాడని అందరికి తెలిసిందే. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో బర్త్ డే విషెస్ తెలియజేశాడు.

Allu Arjun : అల్లు అర్జున్‌కి డేవిడ్ వార్నర్ బర్త్ డే విషెస్..

David Warner birthday wishes to Allu Arjun

Updated On : April 8, 2023 / 1:25 PM IST

Allu Arjun : నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సెలబ్రేటిస్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి (Chiranjeevi), సాయి ధరమ్ తేజ్, నిఖిల్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, హరీష్ శంకర్, ఎస్ ఎస్ థమన్, సురేంద్ర రెడ్డి, గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. తాజాగా ఆస్ట్రేలియాన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) కూడా అల్లు అర్జున్ కి బర్త్ డే విషెష్ తెలియజేశాడు.

Pushpa 2 : తెలుగు, మలయాళంలో కాదు పుష్ప టీజర్ ఎక్కువమంది ఏ ఆడియన్స్ చూశారో తెలుసా?

డేవిడ్ వార్నర్, అల్లు అర్జున్ కి అభిమాని అని అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సాంగ్స్ అండ్ డైలాగ్స్ ని రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాడు వార్నర్. కేవలం వార్నర్ మాత్రమే కాదు తన కుటుంబం కూడా అల్లు అర్జున్ విపరీతంగా అభిమానిస్తుంటుంది. ఇక వార్నర్ చిన్న కూతురు ఇస్లా రోజ్ కి అయితే బన్నీ అంటే చాలా ఇష్టం అంటా. దీంతో నేడు అల్లు అర్జున్ కి ఇస్లా అండ్ వార్నర్ కలిసి బర్త్ డే విషెస్ చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు.

Pushpa 2 : కాళీమాత రూపంలో పుష్ప రాజ్.. వైరల్ అవుతున్న ఫోటో!

హ్యాపీ బర్త్ డే బిగ్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము అని వార్నర్ చెప్పగా, తన కూతురు ఇస్లా హ్యాపీ బర్త్ డే పుష్ప అంటూ బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిన్న పుష్ప 2 (Pushpa 2) నుంచి టీజర్ ని రిలీజ్ చేసి అభిమానులకు గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఆ టీజర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)