Deepika Padukone makes shocking comments about mistakes made in her old films
Deepika Padukone: దీపికా పదుకొణె.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న పేరు. వివాదాలు కూడా ఎక్కువగానే వస్తున్న ఈ అమ్మడుపై. షూటింగ్ రోజులో కేవలం ఎనిమిది గంటలు మాత్రమే చేస్తును అని చెప్పడంతో దీపికా(Deepika Padukone) రెండు భారీ సినిమాల నుంచి తీసివేయబడింది. అవి రెండు కూడా సౌత్ సినిమాలు కావడం విశేషం. ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2, స్పిరిట్ సినిమాల నుంచి ఆమెను తీసేస్తూ అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఇక అప్పటినుంచి ఎదో ఒకరకంగా ఈ బ్యూటీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ వివాదంపై స్పందించింది దీపికా.
Dhanush: తెలుగులో హీరోలు లేదా.. ధనుష్ వెంటపడుతున్న డైరెక్టర్స్.. లిస్టులో ఎవరెవరున్నారో తెలుసా?
ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ..”నా పాత సినిమాలు గుర్తుచేసుకునే బాధేస్తుంది. అందులో కొన్ని సినిమాలు సమస్యలు తెచ్చాయి. డబ్బుల కోసంమే సినిమాలు చాలా మంది అనుకుంటారు. అది నిజం కాదు. సినిమా పెద్దదైనా, చిన్నదైనా కమర్షియల్ అంశాలా కన్నా నేను కథలోని భావాన్ని నమ్ముతాను. ఆ పాత్రను నిజాయితీగా చేయాలనుకుంటాను. గతంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో క్లారిటీ తక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తున్నా. కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆ టైంలో ఎలాంటి తప్పులు చేశానా అని అనిపిస్తుంది. వచ్చే పదేళ్ల తర్వాత కూడా ఇలానే అనిపించే అవకాశం ఉంది. కారణం, కాలం మారుతుంది కాబట్టి” అంటూ చెప్పుకొచ్చిదని దీపికా. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక దీపికా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో కింగ్ సినిమా చేస్తోంది. గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన చెన్నై ఎక్ష్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్ సినిమాలు ఎంత భారీ విజయాన్ని సాధించాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో కింగ్ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల సినిమా నుంచి వచ్చిన టీజర్ కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ రాగా.. సినిమా విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు షారుఖ్ ఫ్యాన్స్.