Dhanush: తెలుగులో హీరోలు లేరా.. ధనుష్ వెంటపడుతున్న డైరెక్టర్స్.. లిస్టులో ఎవరెవరున్నారో తెలుసా?
అలాంటి హీరోలు చాలా తక్కువగా ఉంటారు. అందులో మొదటివరుసలో ఉంటాడు తమిళ హీరో ధనుష్(Dhanush). ముందునుంచి మూస సినిమాలు చేయడానికి దూరంగా ఉంటాడు ఈ హీరో.
Telugu directors showing interest to do movies with Tamil hero Dhanush.
Dhanush: కొంతమంది హీరోలకి మాస్ సినిమాలు బాగా సెట్ అవుతాయి. కొంతమంది హీరోలకు క్లాస్ సినిమాలు సెట్ అవుతాయి. కానీ, కొంతమంది హీరోలకు మాత్రమే అన్ని రకాల సినిమాలు సెట్ అవుతాయి. అలాంటి హీరోలు చాలా తక్కువగా ఉంటారు. అందులో మొదటివరుసలో ఉంటాడు తమిళ హీరో ధనుష్(Dhanush). ముందునుంచి మూస సినిమాలు చేయడానికి దూరంగా ఉంటాడు ఈ హీరో. అందుకే, అన్ని భాషల ఆడియన్స్ ఈ హీరోని తమ హీరోగా చెప్పుకుంటారు. ఇక తెలుగు విషయానికి వస్తే, ఇక్కడ ఏకంగా డైరెక్ట్ సినిమాలు చేసేస్తున్నాడు ధనుష్. ఇప్పటికే తెలుగులో సార్, కుబేరా లాంటి సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ హీరో.
అందుకే, తెలుగు దర్శకులు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు వెంటపడుతున్నారట. ఈ లిస్టులో ముందుగా దర్శకుడు వేణు అడుగుల ఉన్నాడు. సున్నితమైన, భావోద్వేగమైన కథలతో సినిమాలు చేస్తుంటాడు ఈ దర్శకుడు. నీది నాది ఒకే కథ, విరాటపర్వం లాంటి సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నాడు. ఈ దర్శకుడు ఇటీవల ధనుష్ ను కలిసి ఒక అద్భుతమైన కథను వినిపించాడట. ఆ కథ ధనుష్ కి కూడా నచ్చిందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది.
ఇక మరో తెలుగు దర్శకుడు అజయ్ భూపతి కూడా ధనుష్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. ఆయనకు కథను వినిపించేందుకు చాలా ట్రై చేస్తున్నాడట. కానీ, ధనుష్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉండటంతో కలిసే అవకాశం దొరకడం లేదట. ఈ ప్రస్తుతం ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ మొదటి సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలొనే మొదలుకానుంది. ఇలా చాలా మంది తెలుగు దర్శకులు హీరో ధనుష్ తో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ న్యూస్ తెలిసిన తెలుగు ఆడియన్స్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో హీరోలు లేరా.. మనవాళ్లతో మంచి సినిమాలు చేయొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
