×
Ad

OG: పాపం బ్యాడ్ లక్.. ఓజీ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

పవర్ స్టార్ పవర్ ప్యాకుడ్ మూవీ ఓజీ థియేటర్స్ లోకి వచ్చేసింది(OG). స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ సృష్టించిన మాస్ హంగామాకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

Deepika Padukone missed out on the heroine's chance in OG movie

OG: పవర్ స్టార్ పవర్ ప్యాకుడ్ మూవీ ఓజీ థియేటర్స్ లోకి వచ్చేసింది. స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ సృష్టించిన మాస్ హంగామాకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ అయితే చొక్కాలు చించేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఏ పవన్ ని అయితే తాము (OG)మిస్ అవుతున్నారో అదే రేంజ్ లో ఈ సినిమాలో కనిపించేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లెవల్లో వసూళ్లకు సిద్ధమవుతోంది. మొదటి రోజు ఏకంగా రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అది కూడా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ నంబర్స్ కానున్నాయని టాక్.

Nagarjuna: నా ఫోటోలు వాడితే కఠిన చర్యలు.. ఢిల్లీ కోర్టులో నాగార్జున పిటీషన్

ఇదిలా ఉంటే, తాజాగా ఓజీ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటించిన విషయం తెలిసిందే. చేసింది చిన్న పాత్రే అయినా అద్భుతమైన నటనను కనబరిచింది ప్రియాంక. అయితే, ముందు ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెను అనుకున్నారట మేకర్స్. కానీ, ఆమె రూ.16 కోట్ల భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసిందట. దాంతో, ఆమెను పక్కన పెట్టేసి వేరే ఆప్షన్ కి వెళ్లారట మేకర్స్. అలా ఓజీ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులోకి ప్రియాంక ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు జీ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో దీపికా ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఈ సినిమానే కాదు ఇటీవల ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్, కల్కి 2 సినిమాల నుంచి కూడా ఆమె తప్పించారు మేకర్స్. దానికి కూడా వేరే కారణాలు ఉన్నాయి.

ఇక ఓజీ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను ఆయన కల్ట్ ఫ్యాన్ సుజీత్ తెరకెక్కించాడు. ఆయన [పవన్ కళ్యాణ్ ను తెరపై ఎలా చూడాలనుకున్నాడో అనీ ప్రెజెంట్ చేసి భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమాకు తన ఎలక్ట్రిఫయింది మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు తమన్. దసరా సెలవులు కావడంతో రానున్న రోజుల్లో ఓజీ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది.