Delhi court pass orders to stop illegal streaming of Unstoppable Season 2
Unstoppable Season 2 : ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో.. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో అనిపించుకుంటుంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి చంద్రబాబు నాయుడు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి అతిధిలు రావడంతో, ఎంతోమంది ఈ షోపై ఆశక్తి చూపుతున్నారు. దీంతో కొంతమంది ఈ షో ఎపిసోడ్స్ ని ఇల్లీగల్‌గా వేరే సైట్స్ లో పోస్ట్ చేస్తున్నారు.
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తి కారణంగా క్రాష్ అయిన ఆహా యాప్
దీనిపై ఢిల్లీ హై కోర్ట్ లో కేసు ఫైల్ చేసింది అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అన్‌స్టాపబుల్ సంబంధించిన ఎపిసోడ్ అండ్ ప్రోమోలను కొంతమంది అనధికారికంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆ చర్య వాళ్ళ తమకు వాణజ్యపరంగా నష్టం కలుగుతుంది అంటూ పిటీషన్ లో పేరుకొంది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హై కోర్ట్.. అనధికారికంగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ స్ట్రీమింగ్‌ని నిలిపివేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.
తక్షణమే అందుకు సంబంధించిన అనధికారిక లింకులను సామజిక మాద్యమాల నుంచి తొలిగించాలి అంటూ టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మంత్రిత్వశాఖని, ఇంటర్నెట్ ప్రొవైడర్లను నాయస్థానం ఆదేశించింది. కాగా నిన్న ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం కాగా, ఫ్యాన్స్ తాకిడి వల్ల ఆహా సర్వర్ క్రాష్ అయ్యింది. ఇంతలో ఆ ఎపిసోడ్ పలు సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో ప్రసారం అయ్యి ఆహా టీంకి గట్టి షాక్ ఇచ్చింది.