Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తి కారణంగా క్రాష్ అయిన ఆహా యాప్

ఎప్పుడెప్పుడా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే బాహుబలి ఎపిసోడ్‌ను చెప్పిన సమయానికంటే ముందుగానే ఇవాళ రాత్రి 9 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. గతకొద్ది రోజులుగా ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. బాలయ్యతో ప్రభాస్, గోపీచంద్‌లు చేయబోయే సందడిని చూడాలని వారు ఎంతో ఆసక్తిగా చూస్తూ వస్తున్నారు.

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తి కారణంగా క్రాష్ అయిన ఆహా యాప్

AHA App Crashed Due To Prabhas Fans Overload

Prabhas: ఎప్పుడెప్పుడా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే బాహుబలి ఎపిసోడ్‌ను చెప్పిన సమయానికంటే ముందుగానే ఇవాళ రాత్రి 9 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. గతకొద్ది రోజులుగా ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. బాలయ్యతో ప్రభాస్, గోపీచంద్‌లు చేయబోయే సందడిని చూడాలని వారు ఎంతో ఆసక్తిగా చూస్తూ వస్తున్నారు.

Unstoppable 2: సర్‌ప్రైజ్ ఇస్తోన్న డార్లింగ్.. ఆహా అంటోన్న అభిమానులు.. న్యూ ఇయర్ వేడుకలు ముందుగానే స్టార్ట్!

అయితే రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ అవుతుందని తెలుసుకోవడంతో, డార్లింగ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆహా యాప్‌ను ఓపెన్ చేయడంతో, ఓవర్‌లోడ్ కారణంగా యాప్ క్రాష్ అయ్యినట్లుగా ఆహా యాజమాన్యం తాజాగా ప్రకటించింది. తమ యాప్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిందని.. ప్రస్తుతం దాన్ని రీస్టోర్ చేసే పని జరుగుతుందని వారు తెలిపారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు తాము ఖచ్చితంగా చెప్పినట్లుగానే బాహుబలి ఎపిసోడ్‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆహా పేర్కొంది.

Unstoppable 2: అన్‌స్టాపబుల్-2 బాహుబలి ఎపిసోడ్ స్పెషల్ ప్రోమో.. అదిరిపోయింది!

వీలైనంత త్వరగా యాప్‌ను తిరిగి వర్క్ అయ్యేలా చేస్తున్నట్లు ఆహా పేర్కొంది. ఇక అన్‌స్టాపబుల్ 2 టాక్ షోలో ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా తెలిపింది. తొలి పార్ట్‌ను ఇవాళ రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ చేస్తామని.. రెండో పార్ట్‌ను జనవరి 6న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా పేర్కొంది. అయితే ఆహా యాప్ క్రాష్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇది తిరిగి ఎప్పుడు వర్క్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.