Rakshit Shetty: రక్షిత్ శెట్టికి రూ.25 లక్షల జరిమానా.. అనుమతి లేకుండా అలా చేయకూడదు కదా!
కన్నడ స్టార్ హీరో, నిర్మాత రక్షిత్ శెట్టికి రూ.25 లక్షల జరిమానా విధించిన ఢిల్లీ హైకోర్టు.
Delhi High Court Imposes 25 Lakh Fine on Rakshit Shetty
Rakshit Shetty: కన్నడ స్టార్ హీరో, నిర్మాత రక్షిత్ శెట్టికి ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ నిర్మించిన ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమాలో తమ అనుమతి లేకుండా పాటలను వాడుకున్నారంటూ ఎంఆర్టీ మ్యూజిక్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు, రూ.25 లక్షల జరిమానా విధించింది. ‘న్యాయ ఎల్లిదె’, ‘ఒమ్మె నిన్నన్ను’ అనే రెండు పాటల కాపీరైట్స్ తమవేనని సదరు సంస్థ ఫిర్యాదు చేయగా, రక్షిత్ శెట్టి(Rakshit Shetty) తరపు న్యాయవాదులు మాత్రం ఆ పాటలను కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే వినియోగించామని, అది హక్కుల ఉల్లంఘన కిందకు రాదని వాదించారు.
Niharika Konidela: యాక్టింగ్ కి గుడ్ బై చెప్తున్నారా?.. షాకింగ్ కామెంట్స్ చేసిన నిహారిక
అయితే, రక్షిత్ శెట్టి తరపు న్యాయవాదుల వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. పాటల వినియోగం కాకతాళీయంగా జరగలేదని, సినిమా కథకు అనుగుణంగా, వాణిజ్య లాభం కోసమే వాడుకున్నారని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా హీరో బాధలో ఉన్నప్పుడు ‘న్యాయ ఎల్లిదె’ పాటను వాడటం ఉద్దేశపూర్వకమేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రక్షిత్ శెట్టికి జైలు శిక్ష నుండి మినహాయింపు ఇచ్చినప్పటికీ, ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కాపీరైట్ చట్టాల విషయంలో రాజీ లేదని ఈ తీర్పు ద్వారా కోర్టు స్పష్టం చేసింది. దీంతో, ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
