Rashmika Mandanna : రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కానీ..

తాజాగా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Delhi Police Arrested four Members in Rashmika Mandanna Deep fake Video Case

Rashmika Mandanna : ఇటీవల కొన్ని రోజుల క్రితం రష్మికకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో వైరల్ గా మారింది. రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో బాగా ఎక్స్‌పోజింగ్ చేస్తూ లిఫ్ట్ లోకి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అది సంచలనంగా మారింది. ఈ ఫేక్ వీడియోపై రష్మికతో పాటు అన్ని సినీ పరిశ్రమల ప్రముఖులు, అమితాబ్ సైతం దీనిపై సీరియస్ అయ్యారు. అయితే ఈ వీడియో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో చేశారని తెలిసింది.

ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకూడదని, ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు సైతం మండిపడ్డారు. కొన్ని రోజుల పాటు ఈ వీడియో ఘటన వైరల్ గానే ఉంది. పోలీసులు ఈ మార్ఫింగ్ వీడియోపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తాజాగా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read : Rithu Chowdary : నా వీడియోలు మార్ఫింగ్ చేశారు.. మెంటల్ టార్చర్ అనుభవించాను.. రీతూ చౌదరి సంచలన వీడియో..

ఆ నలుగురు ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. అయితే నకిలీ వీడియోను తయారు చేసింది మాత్రం వీరు కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వీడియోను సృష్టించిన సృష్టికర్తల కోసం వెతుకుతున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.