RRR – తారక్ ట్వీట్ : వైరల్ అవుతోన్న ఫోటోస్..

RRR - లొకేషన్ ఫోటో షేర్ చేసిన తారక్.. వైరల్ అవుతున్న పిక్స్..

  • Publish Date - January 29, 2020 / 01:37 PM IST

RRR – లొకేషన్ ఫోటో షేర్ చేసిన తారక్.. వైరల్ అవుతున్న పిక్స్..

RRR.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియన్ సినిమా.. ప్రస్తుతం వికారాబాద్ ఫారెస్ట్‌లో తారక్, చెర్రీ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఒలివియా మోరిస్, రే స్టీవెన్‌సన్,  అలియా భట్, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్ సరసన శ్రియా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అజయ్ దేవ్‌గన్‌కి వెల్‌కమ్ చెబుతూ తారక్ ట్వీట్ చేశాడు.

Read Also : చిరు ఆశీస్సులందుకున్న శౌర్య

దానితో పాటు లొకేషన్‌లో రాజమౌళి, అజయ్ దేవ్‌గన్, తారక్, చెర్రీ కలిసి దిగిన ఫోటోతో పాటు తను, చెర్రీ కలిసి అజయ్ దేవ్‌గన్‌తో కలిసి ఉన్నఫోటో కూడా షేర్ చేశాడు. ఈ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న RRR 10 భాషల్లో విడుదల కానుంది.