Pawan kalyan : తిరుపతి లడ్డూ వివాదం.. హీరో కార్తీ వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కల్యాణ్
కోలీవుడ్ నటుడు కార్తీ నటిస్తున్న మూవీ సత్యం సుందరం.

Deputy CM Pawan kalyan comments on Actor Karthi Over Tirumala Laddu Issue
Pawan kalyan – Karthi : కోలీవుడ్ నటుడు కార్తీ నటిస్తున్న మూవీ ‘సత్యం సుందరం’. అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ‘లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా నాయనా’ అంటూ యాంకర్ ప్రశ్నించింది.
దీని పై కార్తీ చాకచక్యంగా స్పందించాడు. “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఆ టాఫిక్ చాలా సెన్సిటివ్. మనకు వద్దు.” అంటూ సమాధానం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bigg Boss 8 : సోనియాతో గొడవ.. కన్నీళ్లు పెట్టుకున్న యష్మి.. కిర్రాక్ సీత ఏం చేసిందంటే?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహరం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకునే కార్తీ ఇలా మాట్లాడి ఉండవచ్చునని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
కొందరు లడ్డూ మీద జోకులు వేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నిన్న ఒక సినిమా ఫంక్షన్ చూశాను. లడ్డూ టాఫిక్ చాలా సెన్సిటివ్ అని అన్నారు. లడ్డూ టాఫిక్ సెన్సిటివ్ కాదు.. దయచేసి ఎవ్వరూ అలా అనొద్దు అని పవన్ అన్నారు.