Prasanth Varma – Karthi : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కార్తీ.. హనుమాన్ డైరెక్టర్ ప్లాన్ అదిరిందిగా.. అంటే మోక్షజ్ఞతో కూడా..?

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Prasanth Varma – Karthi : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కార్తీ.. హనుమాన్ డైరెక్టర్ ప్లాన్ అదిరిందిగా.. అంటే మోక్షజ్ఞతో కూడా..?

Karthi Will Play a Key Role in Prasanth Varma Cinematic Universe Interesting Comments by Prasanth Varma

Updated On : September 24, 2024 / 7:40 AM IST

Prasanth Varma – Karthi : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సంవత్సరం సంక్రాంతికి హనుమాన్ సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హనుమాన్ సినిమా వచ్చింది. ఆ సినిమాకు లింక్ ఇస్తూ నెక్స్ట్ చాలా సినిమాలు రాబోతున్నాయని, అందులో తెలుగు స్టార్స్ మాత్రమే కాక వేరే భాషల్లోని స్టార్స్ కూడా నటిస్తారని గతంలోనే చెప్పాడు ప్రశాంత్ వర్మ.

దీంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ యూనివర్స్ లోనే బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ పరిచయం కాబోతున్నాడు అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ యూనివర్స్ లో రానా, రణవీర్ సింగ్ కూడా ఉంటారని వార్తలు వస్తున్నాయి. తాజాగా తమిళ్ స్టార్ హీరో కార్తీ కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటారని ఇండైరెక్ట్ గా చెప్పేసాడు ప్రశాంత్ వర్మ.

Also Read : Karthi – Suriya : 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాకు అన్నయ్య నన్ను హగ్ చేసుకున్నాడు.. కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు..

కార్తీ నటించిన సత్యం సుందరం సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా ఈ ఈవెంట్ కి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితమే కార్తీ గారిని కలిసాను. చెన్నై వెళ్లి కలిసాను. ఆల్మోస్ట్ ఆరేళ్ళ తర్వాత చెన్నై వెళ్ళాను కార్తీ గారిని కలవడానికి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఆయన్ని కూడా చూస్తామని ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.

దీంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఓ పాత్ర పోషించడానికి లేదా ఓ సినిమా చేయడానికి కార్తీని కలిసి ప్రశాంత్ వర్మ కథ చెప్పారని తెలుస్తుంది. కార్తీ ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే అని అర్ధమవుతుంది. అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చేసే హీరోలంతా ఏదో ఒక సినిమాలో అందరూ కనిపిస్తారని గతంలో చెప్పాడు ప్రశాంత్ వర్మ. దీంతో తేజ సజ్జతో పాటు బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ, కార్తీ కూడా కలిసి కనిపించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ఫ్యాన్స్. మరి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కార్తీని ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి.