Karthi – Suriya : 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాకు అన్నయ్య నన్ను హగ్ చేసుకున్నాడు.. కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు..
కార్తీ సత్యం సుందరం అనే సినిమాతో సెప్టెంబర్ 28న రానున్నాడు.

Karthi Interesting Comments on his Brother Suriya in Satyam Sundaram Movie Promotions
Karthi – Suriya : తమిళ్ స్టార్ హీరోలు, అన్నదమ్ములు సూర్య, కార్తీలకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్, మంచి మార్కెట్ ఉందని తెలిసిందే. కార్తీ సత్యం సుందరం అనే సినిమాతో సెప్టెంబర్ 28న రానున్నాడు. కార్తీ, అరవింద్ స్వామి మెయిన్ లీడ్స్ లో 96 ఫేమ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సత్యం సుందరం కామెడీ ఎమోషన్ తో ఒక ఫీల్ గుడ్ మూవీలా రానుంది.
సత్యం సుందరం సినిమా ప్రమోషన్స్ తెలుగులో కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులతో సినిమా గురించి మాట్లాడిన కార్తీ ఓ ఆసక్తికర విషయం తెలిపారు. కార్తీ మాట్లాడుతూ.. అన్నయ్య నా మొదటి సినిమా పరుత్తివీరన్ చుసిన తర్వాత నా పర్ఫార్మెన్స్ కు నన్ను హగ్ చేసుకున్నారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు సత్యం సుందరం సినిమా చూసి గర్వంగా నన్ను హగ్ చేసుకున్నారు. హగ్ చేసుకొని అద్భుతంగా పర్ఫార్మ్ చేసానని కాంప్లిమెంట్ ఇచ్చారు అని తెలిపారు.
Also Read : NTR – CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్.. దేవర కోసం..
కార్తీ మొదటి సినిమా పరుత్తి వీరన్ 2007 లో వచ్చింది. అంటే ఇన్నేళ్ల తర్వాత సూర్య ఒక సినిమాకు కార్తీని హగ్ చేసుకొని మరీ బాగా చేసావని చెప్పడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సూర్యనే నిర్మించడం విశేషం.