Bigg Boss 8 : సోనియాతో గొడ‌వ‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న య‌ష్మి.. కిర్రాక్ సీత ఏం చేసిందంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగో వారం కొన‌సాగుతోంది.

Bigg Boss 8 : సోనియాతో గొడ‌వ‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న య‌ష్మి.. కిర్రాక్ సీత ఏం చేసిందంటే?

Emotional Breakdown in BB House

Updated On : September 24, 2024 / 12:18 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగో వారం కొన‌సాగుతోంది. సోమ‌వారం నామినేష‌న్స్ ప్ర‌క్రియ పూర్తైంది. పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్ నామినేష‌న్స్‌లో ఉన్నారు. ఇక మంగ‌ళ‌వారం నాటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది.

‘పృథ్వీ పై య‌ష్మి ఫైర్ అయింది. నువ్వు మదర్, సిస్టర్ అంటే నేను ఎందుకు నమ్ముతాను. అది కరెక్ట్ కాదు.. అలా తీయకూడదు. అంటే మీరిద్దరూ పేరు తీసి దానికి ఏదైనా అటాచ్మెంట్ ను యాడ్ చేయొచ్చా?’ అంటూ ప్ర‌శ్నించింది.

Pushpa 2 – Jani Master : జానీ మాస్టర్‌ని తీసుకోవాలి అనుకున్నాం.. రెండు పాటలు షూటింగ్ బ్యాలెన్స్.. పుష్ప అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

సోనియా వ‌చ్చి.. ‘నేను అంత క్లియర్ గా చెప్పాను కదా’ అని ఇంకా చెప్ప‌బోతుండ‌గా వెంటనే యష్మి ‘నేను గేమ్ పరంగా చూశానమ్మా.. హలో నువ్వు మాత్రం దానికి ఒక అటాచ్మెంట్ ని అటాచ్ చేసి నేను సిస్టర్ ని, మదర్ అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళను వాడుకుంటున్నావు అని నాకనిపిస్తోంది. నువ్వు ఆ ముగ్గురికి ఇస్తున్న ఇంపార్టెన్స్ క్లాన్ లో ఎవ్వరికీ ఇవ్వలేదు నాన్సెన్స్..’ అంటూ మండిప‌డింది. మొత్తంగా ప్రొమో చూస్తుంటే య‌ష్మి, సోనియా మ‌ధ్య వాగ్వాదం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

ఆ త‌రువాత య‌ష్మి ఏడ‌వ‌గా.. కిర్రాక్ సీత‌, నిఖిల్ ఓదార్చిన‌ట్లుగా ప్రొమోలొ క‌నిపించింది.

Padutha Theeyaga : ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం సరికొత్త రికార్డులు.. త్వరలో కొత్త సీజన్..