Padutha Theeyaga : ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం సరికొత్త రికార్డులు.. త్వరలో కొత్త సీజన్..

తెలుగు టెలివిజన్ షోలలో పాడుతా తీయగా ప్రోగ్రాంకి ఉన్న ప్రత్యేకత వేరు.

Padutha Theeyaga : ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం సరికొత్త రికార్డులు.. త్వరలో కొత్త సీజన్..

Padutha Theeyaga Program Creates New Records starting New Season will Soon

Updated On : September 24, 2024 / 7:33 AM IST

Padutha Theeyaga : తెలుగు టెలివిజన్ షోలలో పాడుతా తీయగా ప్రోగ్రాంకి ఉన్న ప్రత్యేకత వేరు. ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది సింగర్స్ ని పరిచయం చేస్తూ పాటలతో అలరించాడు. ఈ షో ద్వారా ఎంతోమంది సింగర్స్ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ షోని ఎన్నో ఏళ్లుగా ముందుండి నడిపించారు. ఆయన మరణించాక షో ఆగకూడదు అని, ఆయన జ్ఞాపకాలతోనే సాగాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ ని హోస్ట్ గా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

పాటల కార్యక్రమాల్లో ఎక్కువ కాలం నడిచిన షోగా పాడుతా తీయగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈటీవీలో 23 సీజన్లను పూర్తి చేసుకోగా ప్రస్తుతం 24వ సీజన్ ప్రసారమవుతుంది. 17 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. త్వరలో 25వ సీజన్ కూడా మొదలు కానుంది. 1996లో ప్రారంభమైన ఈ షో త్వరలోనే సిల్వర్ జూబ్లీ ఈవెంట్ కూడా జరుపుకోనుంది. ఇప్పటి వరకు పాడుతా తీయగా షోలో ఏకంగా 500కి పైగా కంటెస్టెంట్లు పాల్గొన్నారు.

Also Read : NTR – CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్.. దేవర కోసం..

స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణానంతరం ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హోస్ట్‌గా చేస్తూ ఎస్పీబీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం పాడుతా తీయగా షోకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత, పాటల రచయిత చంద్రబోస్, స్టార్ సింగర్స్ సునీత, విజయ్ ప్రకాష్.. జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో రాబోయే కొత్త సీజన్ ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.