Pushpa 2 – Jani Master : జానీ మాస్టర్‌ని తీసుకోవాలి అనుకున్నాం.. రెండు పాటలు షూటింగ్ బ్యాలెన్స్.. పుష్ప అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

మత్తు వదలరా సక్సెస్ మీట్ లో ఆయన పాల్గొనగా జానీ మాస్టర్ వివాదం గురించి, పుష్ప అప్డేట్ గురించి ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.

Pushpa 2 – Jani Master : జానీ మాస్టర్‌ని తీసుకోవాలి అనుకున్నాం.. రెండు పాటలు షూటింగ్ బ్యాలెన్స్.. పుష్ప అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

Pushpa 2 Producer Ravi Shankar Reacts on Jani Master Issue and Pushpa 2 Update

Updated On : September 24, 2024 / 8:40 AM IST

Pushpa 2 – Jani Master : అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వాయిదా పడిన ఈ సినిమాని డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించారు. అయితే పుష్ప 2 షూటింగ్ ఇంకా సాగుతుందట. అసలు డిసెంబర్ లో రిలీజ్ పెట్టుకొని ఇంకా షూటింగ్ లోనే ఉండటం ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు.

తాజాగా పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ ఆ మూవీ గురించి అప్డేట్ ఇచ్చారు. మత్తు వదలరా సక్సెస్ మీట్ లో ఆయన పాల్గొనగా జానీ మాస్టర్ వివాదం గురించి, పుష్ప అప్డేట్ గురించి ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.

Also Read : Bigg Boss Nominations : బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..?

ఈ క్రమంలో నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. పుష్పలో ఇంకా రెండు పాటలు షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత ఆ సాంగ్స్ షూటింగ్ జరుగుతుంది. సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఆ పాటకు జానీ మాస్టర్ ని తీసుకోవాలని అనుకున్నాము. కానీ ఇంతలో ఇలా జరిగింది అని తెలిపారు. దీంతో డిసెంబర్ లో రిలీజ్ పెట్టుకొని ఇంకా రెండు పాటలు షూటింగ్ ఉందా ఎప్పటికి పూర్తి చేస్తారు, ఈ సారి అయినా చెప్పిన సమయానికి రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఇక జానీ మాస్టర్ వివాదం గురించి మాట్లాడుతూ.. మాకు తెలిసిన సమాచారం వరకు అది వాళ్ళ వ్యక్తిగత విషయం. వాటిపై మనం కామెంట్స్ చేయకూడదు. ఆ మహిళా కొరియోగ్రాఫర్ పుష్ప 2 సినిమాకు అడిషినల్ కొరియోగ్రాఫర్ గా పనిచేసింది. అన్ని పాటలకు తీసుకున్నాము. ఆల్రెడీ చేసిన వాటికి పని చేసింది. గతంలో వచ్చిన పాటలకు ఆమె పేరు కూడా ఉంది. జానీ మాస్టర్ తో స్పెషల్ సాంగ్ చేయించాలి అనుకున్నాం కానీ ఇంతలో ఇలా అయింది అని తెలిపారు.