Bigg Boss Nominations : బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..?

నాలుగో వారంలో గత రెండు రోజులు నామినేషన్స్ ప్రక్రియ సాగింది.

Bigg Boss Nominations : బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..?

Bigg Boss Season 8 Fourth Week Nominations Full List Here

Updated On : September 24, 2024 / 8:25 AM IST

Bigg Boss Nominations : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం నాలుగో వారం సాగుతుంది. నాలుగో వారంలో గత రెండు రోజులు నామినేషన్స్ ప్రక్రియ సాగింది. నామినేషన్స్ అంటే కంటెస్టెంట్స్ ఒకర్నొకరు తిట్టుకుంటూ వారం అంతా సాగిన వాటిని గుర్తు చేసి మరీ నామినేట్ చేస్తారని తెలిసిందే.

ఈ నాలుగో వారం నామినేషన్స్ లో కూడా కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు అరుచుకుంటూ నామినేషన్స్ చేసారు. గత వారం యష్మి నాగ మణికంఠ ఉన్నన్నాళ్ళు నామినేట్ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ఆ మాటని గుర్తు చేస్తూ హౌస్ లో నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అని యష్మి మళ్ళీ నాగ మణికంఠని నామినేట్ చేసింది. ఫైనల్ గా పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్‌, నైనికలు నామినేషన్స్ లో నిలిచారు.

Also Read : Vijay Devarakonda : బోట్ డ్రైవింగ్ కూడా చేసేస్తున్న విజయ్ దేవరకొండ.. శ్రీలంకలో ఫుల్‌గా చిల్ అవుతున్నాడుగా..

అయితే చీఫ్ గా ఉన్న నిఖిల్ కు నామినేషన్స్ లో ఉన్న వాళ్ళల్లో ఒకర్ని సేవ్‌ చేసే అవకాశం బిగ్ బాస్ ఇవ్వడంతో అతను నైనికను సేవ్‌ చేశాడు. దీంతో నాలుగో వారం నామినేషన్స్ లో పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్‌ ఉన్నారు. వీరిలో పృథ్వీ లేదా ఆదిత్య ఈ వారం వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.