Vijay Devarakonda : బోట్ డ్రైవింగ్ కూడా చేసేస్తున్న విజయ్ దేవరకొండ.. శ్రీలంకలో ఫుల్‌గా చిల్ అవుతున్నాడుగా..
షూటింగ్ గ్యాప్ లో శ్రీలంకలో విజయ్ చిల్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ.

Vijay Devarakonda Enjoying in Boat Driving at Sri Lanka Video Goes Viral
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో పర్వాలేదనిపించినా నెక్స్ట్ మూడు భారీ పాన్ ఇండియా సినిమాలను ప్రకటించాడు. వీటిల్లో విజయ్ – గౌతమ్ తిన్ననూరి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ స్పై జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో శరవేగంగా సాగుతుంది. విజయ్ సరికొత్త లుక్ లో ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అయితే షూటింగ్ గ్యాప్ లో శ్రీలంకలో విజయ్ చిల్ అవుతున్నాడు కూడా. తాజాగా VD12 షూటింగ్ గ్యాప్ లో శ్రీలంకలో బోట్ రైడింగ్ చేస్తూ ఎంజాయ్ అవుతున్న వీడియోని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
ఈ వీడియోలో శ్రీలంకలోని ఓ నదిలో విజయ్ దేవరకొండ స్వయంగా బోట్ డ్రైవింగ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. విజయ్ ఫ్యాన్స్ అంతా ఈ వీడియో కింద బోట్ డ్రైవింగ్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా విజయ్ దేవరకొండ బోట్ డ్రైవింగ్ వీడియో చూసేయండి..