RRR Janani Song : జనని పాటలో ఈ 15 ఫ్రేమ్స్ గూస్ బంప్స్

గుండె పగిలిన బాధ నుంచి వచ్చిన ఆవేదన.. ఏడుపుతో ఆగదు. అది రివ్వున బాణంలా తిరుగుబాటుకు దారితీస్తుంది

RRR Janani Song : జనని పాటలో ఈ 15 ఫ్రేమ్స్ గూస్ బంప్స్

Rrr Janani Song Cover

Updated On : November 27, 2021 / 12:22 PM IST

RRR Janani Song : ఎస్ఎస్ రాజమౌళి అంటేనే ఓ సినిమా ఎమోషన్. సీన్ ను పండించడంలో ఆయన దిట్ట. హీరోకు అంతులేని ఆవేదన కలిగి.. వీరావేశం వచ్చి… కళ్లుచెదిరే యాక్షన్ సీక్వెన్స్ లో విలన్ల తుక్కు రేగ్గొట్టాలి అంటే… అంతకు ముందు సీన్ లో వ్యక్తిగతంగా.. తనకు గానీ.. సమాజానికి గానీ.. అత్యంత బాధ కలిగే భారీ నష్టం జరిగి ఉండాలి. మామూలు కథల్లోనే ఇలాంటి ప్లాట్ ను ఓ రేంజ్ లో రాసుకుంటాడు జక్కన్న. మరి.. RRR లాంటి దేశ భక్తి బ్యాక్ డ్రాప్ ఉన్న కథ ఆయన చేతిలో ఉంటే… ఆ ఆవేదన-ఆవేశ నేపథ్య సన్నివేశాలు చూస్తే ప్రేక్షకుడి రక్తం ఏసీ హాల్లోనూ మరిగిపోకుండా ఉంటుందా…?

RRR జనని పాటలోనూ ఇదే కనిపిస్తుంది. కథానాయకులు ఎన్టీఆర్-రామ్ చరణ్ కళ్లలో షాకింగ్ ఎక్స్ ‌ప్రెషన్స్.. ఆవేదన.. ఆక్రందన.. తమ కళ్ల ముందు ఏదో వినాశనం, విధ్వంసం, ఊచకోత జరిగిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశాయి.

Rrr Janani Song (4)

Rrr Janani Song (1)

Rrr Janani Song (9)

Rrr Janani Song (2)

Rrr Janani Song (10)

Rrr Janani Song (3)

Rrr Janani Song (3)

Rrr Janani Song (4)

Rrr Janani Song (15)

Rrr Janani Song (5)

నాయికల కళ్లు, చెక్కిళ్లపై నుంచి జారే కన్నీళ్లు అప్పటి ప్రజల కష్టాన్ని, కడుపుకోతను, బతుకు భారాన్ని చూపెట్టాయి. ఆంగ్లేయుల దాష్టీకం, అరాచకం, అన్యాయం, దౌర్జన్యాలను.. వారి హావాభావాలతోనే చూపెట్టాడు దర్శకుడు.

Rrr Janani Song (13)

Rrr Janani Song (6)

Rrr Janani Song (14)

Rrr Janani Song (7)

బుల్లెట్ తగిలిన వ్యక్తినుంచి మరో వ్యక్తి.. ఓ బిడ్డను అందుకుంటున్న సీన్ జనని వీడియో మొత్తానికి ఓ మెరుపు.

Rrr Janani Song (1)

Rrr Janani Song (8)

తూటా గాయంతో ప్రాణాలు పోయినా కూడా.. స్వాతంత్ర్యం కోసమే ఇంకా చిన్నారి కన్నార్పలేదని హింట్ ఇచ్చాడు దర్శకుడు.

Rrr Janani Song (6)

Rrr Janani Song (9)

Rrr Janani Song (7)

Rrr Janani Song (10)

“గుండె పగిలిన బాధ నుంచి వచ్చిన ఆవేదన.. ఏడుపుతో ఆగదు. అది రివ్వున బాణంలా తిరుగుబాటుకు దారితీస్తుంది(The feeling of Heartbreaking pain doesn’t end with sorrow but revolt like an Arrow)”అనేదే RRR థీమ్.

Rrr Janani Song (11)

Rrr Janani Song (11)

పాట వింటున్న దానికంటే.. విజువల్ చూస్తున్నప్పుడు కలిగే ఎమోషనల్ ఫీలింగ్ ఎక్కువ. అప్పటి అరాచక పాలనపై హీరోలు చూపిన రౌద్రం… శత్రువులతో చేసిన రణం… జనం ప్రాణాలు కాపాడేందుకు చిందించిన రుధిరం… ఇలా… భారత స్వాతంత్య్ర సంగ్రామ పోరులో భావోద్వేగానికి RRR ఓ సజీవ సాక్ష్యంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

Rrr Janani Song (12)

Rrr Janani Song (12)

Rrr Janani Song (8)

Rrr Janani Song (13)

Rrr Janani Song (2)

Rrr Janani Song (14)

Rrr Janani Song (5)

Rrr Janani Song (15)

కీరవాణి రాసి, పాడిన జనని పాటలోని లిరిక్స్ కింద చూడొచ్చు.

జననీ…
ప్రియ భారత జననీ
జననీ…
నీ పాద ధూళి తిలకంతో
ఫాలం ప్రకాశమవనీ
నీ నిష్కలంక చరితం
నా సుప్రభాతమవనీ

జననీ….
ఆ నీలి నీలి గగనం
శత విస్ఫులింగ మయమై
ఆ హవ మృదంగ ధ్వనులే
అరి నాశ గర్జనములై
ఆ నిస్వనాలు నా సేదతీర్చు
నీ లాలిజోలలవనీ
జననీ

Read This : RRR Janani : ఇవాళే జనని మెలోడీ రిలీజ్.. RRRకు ఆత్మలాంటి పాటన్న రాజమౌళి