RRR Janani : ఇవాళే జనని మెలోడీ రిలీజ్.. RRRకు ఆత్మలాంటి పాటన్న రాజమౌళి

కీరవాణి రెండు నెలలు కష్టపడ్డారు. తానే పాట రాసి... ట్యూన్ చేశారు. హీరో ఇంట్రడక్షన్లు, ఇంటర్వెల్, భారీ యాక్షన్ సీక్వెన్సులు, క్లైమాక్స్ ఇలాంటివి ఎన్ని ఉన్నా.. వాటన్నింటి వెనుకా...

RRR Janani : ఇవాళే జనని మెలోడీ రిలీజ్.. RRRకు ఆత్మలాంటి పాటన్న రాజమౌళి

Ss Rajamouli

RRR Janani : దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్(రౌద్రం.. రణం.. రుధిరం). ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్ డేట్ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రిలీజ్ కానుంది. మూవీలోని జనని మెలోడీ పాటను విడుదల చేయనుంది మూవీ యూనిట్.

జనని పాట రిలీజ్ కు ఒక్కరోజు ముందు హైదరాబాద్‌లో ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. వారికి పాటలోని కొంత భాగం వినిపించారు. దానికి పాజిటివ్ టాక్ వచ్చింది. తన మనసుకు బాగా నచ్చిన RRR Soul Anthemను రిలీజ్ కు ముందు మీడియా ఆత్మీయులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటుచేశాననన్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాలో జనని పాటకు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పారు. పబ్లిసిటీ కోసం ఈ పనిచేయలేదని.. పబ్లిసిటీ కోసం చేసి ఉంటే ఆ హంగామా వేరే ఉంటుందన్నారు దర్శక ధీరుడు.

Read This : RRR: అంతా సిద్ధం.. ట్రైలర్ కూడా రెడీ.. ఇక రచ్చ రచ్చే!

“నేను ప్రతి సినిమాలో రీరికార్డింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తాను. RRR మూవీలో రీరికార్డింగ్ ను మరింతగా ఆనందించా. ప్రతి సినిమాకు … ఓ ఆత్మ ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా జనని పాట ఆత్మ లాంటిది. దాన్ని పట్టుకోవడానికి పెద్దన్న కీరవాణి రెండు నెలలు కష్టపడ్డారు. తానే పాట రాసి… ట్యూన్ చేశారు. హీరో ఇంట్రడక్షన్లు, ఇంటర్వెల్, భారీ యాక్షన్ సీక్వెన్సులు, క్లైమాక్స్ ఇలాంటివి ఎన్ని ఉన్నా.. వాటన్నింటి వెనుకా… ఓ ఎమోషన్ ను జనని పాట క్యారీ చేస్తుంటుంది. హై రేంజ్ మాస్ సాంగ్ నాటు నాటు లాంటి పాట వింటున్నప్పుడు కూడా… జనని పాట బ్యాక్ గ్రౌండ్ లో ఆడియన్స్ ను హాంట్ చేస్తుంటుంది. అలాంటి ఇంపాక్ట్ ను ఈ పాట క్రియేట్ చేస్తుంది.” అని రాజమౌళి చెప్పారు. మణిహారంలో మణులన్నింటినీ కలిపి ఉంచే దారం లాంటిది ఈ పాట అని రాజమౌళి ఎక్స్ ప్లెయిన్ చేశారు.

Read This : RRR Movie : రాజమౌళి సినిమాకి సల్మాన్ సపోర్ట్..

నవంబర్ 26, 2021 సాయంత్రం 4 గంటలకు జనని పాట రిలీజ్ చేయనుంది మూవీ టీమ్. #Janani #RRRSoulAnthem ట్యాగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ మెలోడీ పాట హృదయాలను తాకేటట్టు ఉంటుందని ఇప్పటికే విన్నవాళ్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.