×
Ad

Devagudi : ‘దేవగుడి’ టీజర్ చూశారా? మళ్ళీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా..

తాజాగా ఈ సినిమా టీజర్ ని హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు.(Devagudi)

Devagudi

Devagudi : పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శక నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా ‘దేవగుడి’. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు.(Devagudi)

దేవగుడి అనే ఓ ఊళ్ళో జరిగే యాక్షన్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె విలన్ గా నటిస్తున్నారు. మీరు కూడా దేవగుడి టీజర్ చూడండి..

Also Read : Bollywood Couple : పండంటి పాపాయికి జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ కపుల్.. వెడ్డింగ్ యానివర్సరీ రోజే డెలివరీ..

టీజర్ రిలీజ్ అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. 2013 నుంచి నిర్మాతగా రామకృష్ణా రెడ్డి ఎన్నో సినిమాలు తీశారు. అప్పట్లోనే ఆయన్ని డైరెక్షన్ చేయమని అడిగాను. ఆయన డైరెక్టర్ గా మారారు. ‘దేవగుడి’ టైటిల్ బాగుంది. టీజర్ కూడా బాగుంది. సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి. ఇది ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రియల్‌గా జరిగిన స్టోరీ. నాకు ఈ స్టోరీ తెలుసు. రఘు కుంచె, మేమంతా ఒకేసారి స్టార్ట్ అయ్యాం. తను సంగీతంతోనే కాదు ఆర్టిస్ట్‌గా కూడా మంచి పాత్రలు చేస్తున్నాడు అని అన్నారు.

దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. 2013లో శ్రీకాంత్‌గారితోనే పుష్యమి ఫిలిం మేకర్స్ మొదలయింది. ఆయన ఏ నోటితో అన్నారో ఆ రోజు.. భయ్యా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చుగా అని. ఆ తర్వాత ఆయన అన్నట్టే దృశ్యకావ్యం సినిమా డైరెక్ట్ చేశాను. ఇప్పుడు మళ్లీ దేవగుడి చేస్తున్నాను. ఈ రెండు సినిమాలకు ఆయన సపోర్ట్ చేసారు. డిసెంబర్ 19న దేవగుడి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అని తెలిపారు.

Also Read : Priyanka Chopra : 23 ఏళ్ళ క్రితమే తెలుగులో సినిమా చేసిన ప్రియాంక చోప్రా.. రాజమౌళి – మహేష్ ఫస్ట్ కాదు..