Devara Movie Update Dubbing Started Actress Himaja Post goes Viral
Devara Update : ఎన్టీఆర్ నుంచి RRR తర్వాత ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. RRR తర్వాత అనౌన్స్ చేసిన ‘దేవర’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27 రానున్నట్టు ఇటీవల ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వంలో ఫుల్ మాస్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే దేవర సినిమా షూటింగ్ ఇంకా జరుగుతుందనే అనుకుంటున్నారు. ఇటీవల థాయిలాండ్ కి వెళ్లి ఎన్టీఆర్, జాన్వీ మీద ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేసారు. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్, నటి హిమజ పెట్టిన పోస్ట్ తో దేవర మరోసారి వైరల్ అవుతుంది. మూవీ టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయినా హిమజ దేవర సినిమాకు డబ్బింగ్ చెప్పాను, సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అని డబ్బింగ్ చెప్పిన ఫోటోలు పోస్ట్ చేసింది.
Also Read : Akshay Kumar : కష్టాల్లో ఉన్న ఆ సింగర్‌కు ఏకంగా 25 లక్షలు దానం చేసిన స్టార్ హీరో..
దీంతో హిమజ పోస్ట్ వైరల్ గా మారింది. మూవీ టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోయినా హిమజ పోస్ట్ తో దేవర డబ్బింగ్ మొదలుపెట్టేసినట్లు తెలుస్తుంది. దీంతో దేవర పార్ట్ 1 షూటింగ్ కూడా అయిపోయిందని భావిస్తున్నారు. ఈ నెలలో ఓ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. సినిమా రిలీజ్ కి ఇంకా మూడు నెలలే ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తిచేసి ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు దేవర టీమ్. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుండగా సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ రోల్ లో చేస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు.