Devi Sri Prasad marriage gossip gone viral - Pic Source Google
Devi Sri Prasad : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్ తీస్తే కొంచెం పెద్దదే ఉంటుంది. ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచేది ప్రభాస్ (Prabhas). ఈ డార్లింగ్ పెళ్లి కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే రామ్ పోతినేని (Ram Pothineni), అడివి శేషు (Adivi Sesh), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) అండ్ వరుణ్ తేజ్ (Varun Tej). వీరంతా మూడు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి మాట ఎత్తకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.
Sobhita Dhulipala : సమంతను పెళ్లికూతురిగా చూసి ఏడ్చేశాను.. శోభిత ధూళిపాళ!
ఇక ఈ లిస్ట్ లో మొన్నటి వరకు ఉన్న శర్వానంద్ (Sharwanand) ఎంగేజ్మెంట్ చేసుకొని లిస్ట్ నుంచి బయటకి వచ్చేశాడు. అలాగే వీరితో పాటు ఇండస్ట్రీలో మరో బ్యాచ్‌లర్ కూడా ఉన్నాడు. అతడే మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad). పుష్ప సినిమాతో దేవిశ్రీ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యిపోయాడు. దీంతో ఈ రాక్ స్టార్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. 1979 ఆగష్టు 2న పుట్టిన దేవిశ్రీ వయసు 43 ఏళ్ళు. నాలుగు పదులు వయసు దాటినా ఇప్పటికి ఈ సంగీత దర్శకుడు పెళ్లి మాట మాట్లాడడం లేదు.
Dasara Collections : నాని దూకుడు మాములుగా లేదు.. 4 రోజుల్లో దసరా కలెక్షన్స్?
గతంలో దేవిశ్రీ పెళ్లి పై కొన్ని వార్తలు వినిపించినా అవన్నీ రూమర్స్ గానే నిలిచాయి. తాజాగా మరోసారి ఈ పెళ్లి వార్తలు తెర పైకి వచ్చాయి. తమ దూరపు బంధువుల కుటుంబంలోని అమ్మాయినే దేవిశ్రీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. ఆ అమ్మాయి దేవికి మరదలు వరుస అవుతుందని, ఇద్దరి మధ్య దాదాపు 17 ఏళ్ళ వయసు గ్యాప్ ఉందని సమాచారం. మరి దేవిశ్రీను ప్రసాద్ నిజంగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా? అంటే క్లారిటీ లేదు.