Devil Movie Maya Chesave song recording with number of other countries music Instruments
Devil Movie Song : నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా తెరకెక్కుతున్న సినిమా డెవిల్(Devil). ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. స్వాతంత్య్రం కంటే ముందు జరిగిన సంఘటనలపై, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. డెవిల్ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల డెవిల్ సినిమా నుంచి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ ల మధ్య సాగే ఒక లవ్ సాంగ్ ని కూడా రిలిజ్ చేశారు. డెవిల్ నుంచి వచ్చిన ‘మాయ చేశావే’ సాంగ్ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను చూపించింది. డెవిల్ సినిమా 1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాక్ గ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను చిత్రీకరించారు.
Also Read : Dhruva Natchathiram : ఎన్నాళ్ళో వేచిన సినిమా.. విక్రమ్ ‘ధ్రువ నక్షత్రం’ వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్..
నాటి కాలంలోకి తీసుకెళ్లేందుకు సంగీతం కూడా ఎంతో ఉపయోగపడింది. సంగీతం విషయంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ ద్వయం కలిసి ఇలాంటి వింటేజ్ సాంగ్‌ను క్రియేట్ చేశారు. ఈ పాటలో రకరకాల వాయిద్యాలు వాడారు. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను తెప్పించి ఈ పాటలో వాడారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లారు. దీంతో ఒక్కపాట కోసం ఇన్ని దేశాల నుంచి వాయిద్యాలను తెప్పించారా అని ఆశ్చర్యపోతున్నారు.