×
Ad

Tere Ishk Mein Review : ‘తేరే ఇష్క్ మే’ మూవీ రివ్యూ.. ధనుష్ బాలీవుడ్ సినిమా ఎలా ఉంది?

రాంఝనా లాంటి హిట్ తర్వాత ఆనంద్ L రాయ్ - ధనుష్ కాంబోలో వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. (Tere Ishk Mein Review)

Image Credits : Colour Yellow Movies

Tere Ishk Mein Review : గతంలో ధనుష్ – బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ L రాయ్ కలిసి చేసిన రాంఝనా సినిమా పెద్ద హిట్ అయింది. ఇటీవల ఈ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ కూడా చేసారు. 12 ఏళ్ళ తర్వాత ఈ డైరెక్టర్ – హీరో కాంబో మరోసారి తేరే ఇష్క్ మే సినిమాతో బాలీవుడ్ ముందుకు వచ్చారు. ధనుష్ – కృతి సనన్ జంటగా తెరకెక్కిన తేరే ఇష్క్ మే సినిమా కేవలం హిందీలో నవంబర్ 28న రిలీజయింది.(Tere Ishk Mein Review)

కథ విషయానికొస్తే.. శంకర్ గురుక్కల్(ధనుష్) ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్. అతనికి ముక్కు మీద కోపం. తరచుగా గొడవలు పడుతుంటాడు. ఆ కాలేజీకి ముక్తి భేనివాల్(కృతి సనన్) పీహెచ్‌డి థీసిస్ చేయడానికి వస్తుంది. కొన్ని ప్రయోగాల ద్వారా కోపధారి మనిషిని మాములు మనిషిగా ఎలా మార్చొచ్చు అనే థీసిస్ చేస్తుంది. తన థీసిస్ కి అనుకోకుండా శంకర్ ఎదురవడంతో తనని మార్చి తన థీసిస్ పూర్తి చేయాలని అనుకుంటుంది.

ఈ క్రమంలో శంకర్ తో పరిచయం చేసుకుంటుంది. శంకర్ నిజంగా లవ్ చేస్తే ముక్తి మాత్రం టైం పాస్ కి చేస్తుంది. శంకర్ లైఫ్ లో ఎదిగితే అప్పుడు ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తాను అని ముక్తి, ముక్తి తండ్రి చెప్పడంతో శంకర్ సివిల్స్ చేయడానికి వెళ్తాడు. మరి శంకర్ లైఫ్ లో సక్సెస్ అవుతాడా? ముక్తి శంకర్ వచ్చేవరకు ఆగుతుందా? ముక్తి నిజంగానే శంకర్ ని ప్రేమిస్తుందా.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Aan Paavam Pollathathu : ‘ఆన్ పావమ్ పొల్లతత్తు’ రివ్యూ.. భార్యాభర్తలు కచ్చితంగా చూడాల్సిన సినిమా.. క్లైమాక్స్ ఏడిపించేసారుగా..

సినిమా విశ్లేషణ..

రాంఝనా లాంటి హిట్ తర్వాత ఆనంద్ L రాయ్ – ధనుష్ కాంబోలో వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. అయితే రాంఝనా కేవలం లవ్ స్టోరీ అయితే దీంట్లో లవ్ స్టోరీని సాగదీసి లైఫ్, శత్రు దేశాలతో యుద్దాలు, ఆర్మీ.. అంటూ కథని ఎక్కడికెక్కడికో సాగదీశారు. కృతి సనన్ – ధనుష్ మధ్య కొన్ని లవ్ సీన్స్ బాగా రాసుకున్నారు. హీరో ఏకంగా హీరోయిన్ ఇంటిని తగలపెట్టడం, అమెరికాలో ఉండే వ్యక్తి ఇక్కడ ఆర్మీలో ఉండటం లాంటి కొన్ని సీన్స్ మాత్రం లాజిక్ లెస్ గా అనిపిస్తాయి.

ధనుష్ – కృతి సనన్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా మెప్పిస్తాయి. ఆర్మీ యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి. అయితే క్లైమాక్స్ ని ఎవరూ ఊహించలేరు. క్లైమాక్స్ లో కన్నీళ్లు ఖాయం. అధికారికంగా చెప్పకపోయినా పార్ట్ 2 కి స్కోప్ ఉంది. కోపంగా ఉండే అబ్బాయిని హీరోయిన్ ఎలా కంట్రోల్ చేసింది, ప్రేమిస్తుందా లేదా అని ఒక కొత్త తరహా ప్రేమకథగా చూపించారు.

Image Credits : T Series

నటీనటుల పర్ఫార్మెన్స్..

ధనుష్ ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నర్. తన ఎన్నో సినిమాల్లో పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఈ సినిమాలో కూడా ప్రేమ, కోపం, సైలెన్స్.. వేరియేషన్స్ చూపిస్తూ చాలా బాగా నటించాడు. కృతి సనన్ కు చాలా రోజుల తర్వాత నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర పడింది. ఎమోషనల్ సీన్స్ లో బాగా మెప్పించింది. ప్రకాష్ రాజ్, ప్రియాంశు, తోతా రాయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Revolver Rita Review : ‘రివాల్వర్ రీటా’ మూవీ రివ్యూ.. డాన్ వచ్చి హీరోయిన్ ఇంట్లో చనిపోతే ఏం జరిగింది..?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఏ ఆర్ రహమాన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు. పాటలు కూడా బాగున్నాయి. సినిమాలో చాలా సీన్స్ ని రెహమాన్ తన మ్యూజిక్ తోనే నిలబెట్టాడు. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఆనంద్ రాయ్ మరో సరికొత్త ప్రేమకథని చక్కగా తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.

మొత్తంగా ‘తేరే ఇష్క్ మే’ సినిమా బాలీవుడ్ లో ఓ సరికొత్త ప్రేమకథ. ఓ సారి చూసేయొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.