ధనుష్‌కి బెస్ట్ కమెడియన్ అవార్డ్

'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'.. అనే హాలీవుడ్ మూవీకిగానూ బెస్ట్ కమెడియన్ అవార్డ్‌ను గెల్చుకున్నాడు ధనుష్‌..

  • Published By: sekhar ,Published On : May 7, 2019 / 10:29 AM IST
ధనుష్‌కి బెస్ట్ కమెడియన్ అవార్డ్

Updated On : May 7, 2019 / 10:29 AM IST

‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’.. అనే హాలీవుడ్ మూవీకిగానూ బెస్ట్ కమెడియన్ అవార్డ్‌ను గెల్చుకున్నాడు ధనుష్‌..

ప్రముఖ తమిళ స్టార్ హీరో ధనుష్ మరో అరుదైన ఘనత సాధించాడు. అతను నటించిన హాలీవుడ్ మూవీకిగానూ బెస్ట్ కమెడియన్ అవార్డ్‌ను గెల్చుకున్నాడు ధనుష్‌.. కెన్ స్కాట్ డైరెక్షన్‌లో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’.. ఇంగ్లీష్, స్పెయిన్ భాషల్లో రూపొందిన ఈ మూవీలో ధనుష్, స్ట్రీట్ మ్యాజిక్ మెన్‌గా నటించాడు. తన గారడీతో అందరినీ బురిడీ కొట్టిస్తూ, కడుపుబ్బా నవ్వించాడు.

రీసెంట్‌గా స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో జరుగుతున్న సెయింట్‌‌జార్జ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాని ప్రదర్శించారు. సినిమా చూసిన అవార్డ్ కమిటీ వారు బెస్ట్ కామెడీ ఫిలిం కేటగిరీలో ఈ సినిమాకి అవార్డ్ అనౌన్స్ చేసారు. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ కమెడియన్ అవార్డ్ దక్కించుకోవడం హ్యాపీగా ఉందని ధనుష్ చెప్పాడు.

వాచ్ ట్రైలర్..