×
Ad

Own House : భార్య పెద్ద సింగర్, భర్త యాక్టర్, డైరెక్టర్.. అయినా సొంతిల్లు లేదట.. నేను ఇస్తానని మాట ఇచ్చిన నిర్మాత..

కొంతమంది సినీ సెలబ్రిటీలకు ఫేమ్ ఉన్నా డబ్బులు ఉండవు, సొంతిల్లు లేని సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. (Own House)

Own House : సినిమా సెలబ్రిటీలు అంటే బాగా ఆస్తులు ఉంటాయి, సెటిల్ అయి లగ్జరీ లైఫ్ గడుపుతారు అనే అంతా అనుకుంటారు. కానీ కొంతమంది సినీ సెలబ్రిటీలకు ఫేమ్ ఉన్నా డబ్బులు ఉండవు, సొంతిల్లు లేని సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. తాజాగా అలాంటి ఓ సెలబ్రిటీ జంటకు నిర్మాత ధీరజ్ మొగిలినేని సొంతిల్లు కొనిస్తాను అని అన్నారు.(Own House)

ఇంతకీ ఆ సెలబ్రిటీ జంట ఎవరో కాదు రాహుల్ రవీంద్రన్ – చిన్మయి. తెలుగు, తమిళ్ భాషల్లో సింగర్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న చిన్మయి ఆ తర్వాత వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇక రాహుల్ రవీంద్రన్ నటుడిగా బిజీగా ఉన్నా దర్శకుడిగా కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మెయిన్ లీడ్ లో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7 న రిలీజ్ కానుంది.

Also Read : Dhee Raju : డ్యాన్సర్స్ అంటే అంత చిన్న చూపా..? మా నాన్న మమ్మల్ని వదిలేసాడు.. ఢీ రాజు ఎమోషనల్..

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ది గర్ల్ ఫ్రెండ్ నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. రాహుల్ రవీంద్రన్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. తర్వాత మేము కలిసి సినిమాలు చేసినా చేయకపోయినా మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. రెండురోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో సినిమా వర్క్ ముగించుకొని రాత్రి కలిసి వెళ్తున్నాము. సినిమా గురించి అలా అలా మాట్లాడుతూ నాకు రాహుల్ ఓ విషయం చెప్పాడు.

ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కుంటాను బ్రో అన్నాడు. ఇద్దరు కిడ్స్ ఉన్నారు, వాళ్ళు పెద్దవుతున్నారు, వాళ్ళను చూసుకోవాలి వాళ్ళ కోసం అయినా ఇల్లు కొనాలి అని చెప్పాడు. హైదరాబాద్ లో కానీ, బయట కానీ రాహుల్ రవీంద్రన్ కి ఇప్పటిదాకా సొంతిల్లు లేదు. ఈ సినిమా హిట్ అయితే నేనే మీ ఇంటి కలను నెరవేరుస్తాను. నాకు నెక్స్ట్ సినిమా తర్వాత చేసినా పర్లేదు. నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం నీ సొంతింటి కల నేను తీరుస్తాను అని అన్నారు.

Also Read : Roja : పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న రోజా.. వయసైపోయిన పెద్దావిడ లుక్ తో.. ప్రోమో అదిరిందిగా

దీంతో నిర్మాత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చిన్మయి పెద్ద సింగర్, రాహుల్ రవీంద్రన్ మంచి యాక్టర్ అయినా సొంతిల్లు లేదా అని ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. మరి రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా హిట్ అయి రాహుల్ రవీంద్రన్ కి నిర్మాత సొంతిల్లు కొనిస్తాడా చూడాలి.