Dhee Raju : డ్యాన్సర్స్ అంటే అంత చిన్న చూపా..? మా నాన్న మమ్మల్ని వదిలేసాడు.. ఢీ రాజు ఎమోషనల్..

 డ్యాన్సర్ గా సినీ పరిశ్రమలోకి వచ్చిన రాజు ఢీ 10 షో విన్ అవ్వడంతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. (Dhee Raju)

Dhee Raju : డ్యాన్సర్స్ అంటే అంత చిన్న చూపా..? మా నాన్న మమ్మల్ని వదిలేసాడు.. ఢీ రాజు ఎమోషనల్..

Dhee Raju

Updated On : November 6, 2025 / 7:56 AM IST

Dhee Raju : డ్యాన్సర్ గా సినీ పరిశ్రమలోకి వచ్చిన రాజు ఢీ 10 షో విన్ అవ్వడంతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రాజు పలు డ్యాన్స్ షోలు, టీవీ షోలలో కనిపిస్తూ సెలబ్రిటీ అయ్యాడు. రాజు చాలా చిన్న కుటుంబం నుంచే వచ్చినట్టు గతంలో ఢీ షోలో చెప్పాడు. తాజాగా రాజు ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా రాజు డ్యాన్సర్స్ ని చిన్న చూపు చూస్తున్నారని, తన తండ్రి వదిలేసాడని పలు విషయాలు చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.(Dhee Raju)

రాజు మాట్లాడుతూ.. ఢీ 10 గెలిచిన తర్వాత రూమ్ కోసం తిరిగాను హైదరాబాద్ లో చాలా చోట్ల. ఎక్కడికి వెళ్లినా కూడా మీరేం చేస్తారు అని అడిగేవాళ్లు. డ్యాన్సర్ అని చెప్తే డ్యాన్సర్లకు రూమ్ ఇవ్వం అనేవాళ్ళు. నాకు కోపం వచ్చి విల్లా దగ్గరకు వెళ్ళా. రెంట్ ఎంత అంటే 60 వేలు అన్నారు. అయినా సరే కడతాను అన్నాను. కానీ అక్కడ కూడా మీరేం చేస్తారు అని అడిగారు. మళ్ళీ అదే ప్రశ్నేనా అనుకోని డ్యాన్సర్ అని చెప్పా. అక్కడ కూడా డ్యాన్సర్స్ కి మేము ఇవ్వము అని అన్నారు. అంత చీపా డ్యాన్సర్స్ అంటే బయట వాళ్లకు అని చెప్పుకొచ్చాడు.

Also Read : Roja : పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న రోజా.. వయసైపోయిన పెద్దావిడ లుక్ తో.. ప్రోమో అదిరిందిగా

అలాగే తన తండ్రి గురించి మాట్లాడుతూ.. నాకు ఆస్తి ఏం లేదు. డీ 10 గెలిచిన తర్వాత ఉండేది. కానీ తర్వాత మా నాన్న మొత్తం అమ్మేసారు. ఇప్పుడేం లేదు. మా నాన్న కూడా నాకు ఇష్టం. కానీ ఆయన మమ్మల్ని వద్దనుకుని నన్ను, అమ్మని వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఆయన వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటే మేము ఏం చేస్తాం. ఆయన వెళ్ళిపోయాక నాకు బాధ్యత ఎక్కువ పెరిగింది. నాన్న వెళ్ళిపోయాక నా నెత్తిమీద భారం పడింది. గుండె బరువెక్కింది. నేను మా అమ్మతో ఒకటే అన్నా.. ఇప్పటివరకు నాన్న చూసుకున్న దానికంటే వందరెట్లు ఎక్కువ చూసుకుంటా అని చెప్పాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Also Read : The Great Pre Wedding Show : ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..