Song from Dasara : ధూమ్ ధామ్ దోస్తాన్.. పక్కా తెలంగాణ మాస్ సాంగ్ తో అదరగొట్టేసిన నాని..
తాజాగా దసరా సినిమా నుంచి దసరా కానుకగా ఫస్ట్ పాటని విడుదల చేశారు. ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. బొగ్గు గనుల్లో హీరో, అతని స్నేహితుల గ్యాంగ్‌పై...........
- Saketh U
- Published On : October 3, 2022 / 08:00 PM IST
Dhoom Dhaam Dosthana song release from Nani Dasara Movie
Song from Dasara : ఇన్నాళ్లు క్లాస్ సినిమాలతో హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని ఈ సారి పూర్తిగా మాస్ సినిమా ‘దసరా’తో రాబోతున్న సంగతి తెలిసిందే. నాని హీరోగా, కీర్తి సురేష్ జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ లో నాని ఫుల్ మాస్, రఫ్ లుక్ లో కనపడటంతో సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.
తాజాగా దసరా సినిమా నుంచి దసరా కానుకగా ఫస్ట్ పాటని విడుదల చేశారు. ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. బొగ్గు గనుల్లో హీరో, అతని స్నేహితుల గ్యాంగ్‌పై ఈ పాటని చిత్రీకరించారు. మధ్యలో తెలంగాణ బతుకమ్మ పండగ మీద కూడా కొన్ని లిరిక్స్, సన్నివేశాలు ఉన్నాయి. పక్కా తెలంగాణ యాసలో మాస్ బీట్ తో ఈ పాట సాగింది. ఇక ఈ సినిమాలో నాని లుక్ చాలా కొత్తగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పాటలో నాని డ్యాన్స్ యూదా అదరగొట్టేశాడు.
Unstoppable 2 : 30 వేలమంది అభిమానుల మధ్య.. విజయవాడలో బాలయ్యబాబు అన్‌స్టాపబుల్ సీజన్ 2 లాంచ్..
ధూమ్ ధామ్ అంటూ సాగిన ఈ సాంగ్ ని కాసర్ల శ్యామ్ రచించగా రాహుల్ సిప్లిగంజ్, జంగిరెడ్డి కలిపి పాడారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాని మార్చి 30న పాన్ ఇండియా వైడ్ విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు.
